Site icon HashtagU Telugu

Ugadi 2025: ఈ ఏడాది మొత్తం శుభం జరగాలి అంటే ఉగాది పండుగ రోజు ఆ పని చేయాల్సిందే.. కానీ!

Ugadi 2025

Ugadi 2025

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన మొదటి తెలుగు పండుగ ఉగాది అని చెప్పాలి. తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది పండుగ తోనే ప్రారంభమవుతుంది. ప్రతీ ఏడాది ఈ ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకోనున్నారు. ఉగాది పండుగను కొత్తదనానికి నాందిగా, కొత్త పనులు చేయడానికి ప్రారంభ రోజుగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే ఈ ఉగాది పండుగ రోజున తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదట.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామందికి ఉదయం సూర్యోదయం అయినా కూడా తొమ్మిది, పది గంటల వరకు నిద్రపోవడం అలవాటు. కానీ ఉగాది పండుగ రోజు మాత్రం ఆలస్యంగా నిద్ర లేవడం అసలు మంచిది కాదట. ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలట. మద్యం కూడా సేవించకూడదని చెబుతున్నారు. ఈ రెండు రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. అదేవిధంగా ఉగాది రోజు చాలా మంది పంచాంగ శ్రవణం చేస్తుంటారు. అయితే అలా పంచాంగ శ్రవణం దక్షిణ ముఖంగా కూర్చొని చేయకూడదట.

ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయట. దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసినకర్రను కూడా ఉగాది రోజే కొనుగోలు చేసేవారట. కొత్తబట్టలు, కొత్త ఆభరణాలు వేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. కాబట్టి ఉగాది పండుగ రోజు మనకంత మంచే జరగాలంటే పైన చెప్పిన వస్తువులను ఉగాది పండుగ రోజు కొనుగోలు చేయడం మంచిది. అలాగే పైన చెప్పిన మద్యం సేవించడం మాంసాహారం తినడం వంటి పనులు అస్సలు చేయకూడదని వీటి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.