Vastu Shastra: లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీతో ఉండాలంటే శుక్రవారం ఇలా చేయండి!

పురాణాలప్రకారం శుక్రవారం అంటే లక్ష్మీదేవి రోజు. అందుకే లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 07:00 AM IST

పురాణాలప్రకారం శుక్రవారం అంటే లక్ష్మీదేవి రోజు. అందుకే లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తుంటారు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే..సంపద, శ్రేయస్సు మీపై ఉంటుంది. కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఈ వస్తువులను లక్ష్మీదేవికి సమర్పించండి:
మఖానా, శంఖ, కవాడే, బటాషా అనేవి లక్ష్మి తల్లికి చాలా ప్రీతికరమైనవి. శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి ఈ వస్తువులన్నీ సమర్పించండి. మీరు ఆలయానికి వెళ్లలేకపోతే, ఇంట్లో పూజాగదిలో లక్ష్మీదేవికి ఈ వస్తువులన్నీ సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది.

ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు:
మీరు తరచుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే…శుక్రవారం రోజున ఉదయం కనకధారా స్తోత్రాన్ని పఠించి సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ నశించి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

డబ్బు ఆదా చేయాలంటే:
మీ ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటే…ఈ పరిష్కారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఇనుప పాత్రలో నీరు, పంచదార, నెయ్యి, పాలు తీసుకుని చెట్టుకుపోసి మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు ఆదా అవుతుంది.

గంగా పరిష్కారం:
ఇల్లు శుభ్రంగా ఉంటేనే, ఇంట్లో ఆనందం సమృద్ధి, వృద్ధికి అన్ని మార్గాలు తెరవబడతాయి. పరిశుభ్రత, సభ్యతతో నివసించే వారి ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది. శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేసి ముందుగా పూజాగదిలో గంగాజలం చల్లి పూజ చేయాలి. మీకు లక్ష్మీమాత అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.

తులసి పూజ:
విష్ణువుకు ప్రీతికరమైనది కనుక తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. శుక్రవారాల్లో తులసిని పూజించడం వల్ల మీ ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది. శుక్రవారం ఉదయం తులసిచెట్టుకు నీరు, పచ్చి పాలు సమర్పించండి. సాయంత్రం తులసి చెట్టుకింద నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.