Site icon HashtagU Telugu

Saturday: జాతక దోషాలు పోవాలి అంటే.. అయితే ఎనిమిది శనివారాలు ఇలా చేయాల్సిందే!

Saturday

Saturday

మామూలుగా ప్రతి ఒక్కరి జాతకంలో ఎన్నో రకాల ఉంటాయి. ఇలా దోషాలు ఉన్న సమయంలో మనం ఏ పని చేసినా కూడా అది జరగదు. అలాంటి సమయంలో చాలామంది దోష పరిహారాలు పాటిస్తూ ఉంటారు. పూజలు వ్రతాలు దానధర్మాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఎదుర్కొనే వాటిలో జాతక దోషం కూడా ఒకటి. ఈ జాతక దోషం తొలగిపోవాలి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఎనిమిది వారాలు ఇప్పుడు చెప్పినట్టు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి అని జాతక దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

అయితే మహిళలు ఈ దోష పరిహారైనా చేసే సమయంలో వారికి ఏదైనా అడ్డంకులు ఏర్పడిన ఆ వారం వదిలేసి మరుసటి వారాన్ని కూడా లెక్కపెట్టుకొని చేయవచ్చట. మరి జాతక దోష పరిహారం కోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. శనివారం రోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి వెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలట. తర్వాత స్వామివారి ముందు దీపం వెలిగించడం కోసం బియ్యపు పిండి, చిన్న బెల్లం ముక్క పాలు అరటి ముక్కలు వేసి ఆ పిండిని బాగా కలిపి ప్రమిదలాగా తయారు చేసుకోవాలట.

ఇలా ప్రమిద తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలోకి నువ్వుల నూనె వేసి ఏడు వత్తులు వేసి దీపం వెలిగించాలట. ఇలా ఏడు వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఈ విధంగా దాదాపు 8 శనివారాలు చేస్తే జాతకంలో ఉండే దోషాలు అన్ని తొలగిపోతాయట. అలాగే మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయట. మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా జాతక దోషాలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పినట్టుగా 8 శనివారాలు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు.