ప్రతిఒక్కరూ తమపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు ఉండకూడదనకుంటారు.లక్ష్మీదేవి ఎప్పుడూ మీత ఉండాలంటే..మీరుకొన్ని చర్యలు పాటించాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని చర్యలు ఉదయం నిద్రలేచిన వెంటనే చేయాల్సినవి గ్రంథాలలో పేర్కొన్నారు. ఈ పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
తులసి పూజ:
తులసి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. విష్ణుప్రియ తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలైతుంది. సనాతన ధర్మంలో తులసిని పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే తులసి నీళ్లను నైవేద్యంగా పెట్టడం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
తులసికి నీళ్ళు సమర్పించండి:
ప్రతిరోజు ఉదయం తులసికి నీళ్ళు సమర్పించి.. ఈ మంత్రాన్ని జపించండి – మహాప్రసాద జనని, సర్వ సౌభాగ్యవర్ధిని, ఆది వ్యాధి హర నిత్యం, తులసి త్వం నమోస్తుతే. ఈ మంత్రం అదృష్టం, సంతానోత్పత్తి, వ్యాపారంలో పురోగతి, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని తీసుకువస్తుంది.
తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించండి:
ప్రదోష కాలంలో సాయంత్రం పూజ అనంతరం తులసి మొక్క కింద నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇలాచేస్తే మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
ఇది ఇంటికి శ్రేయస్సును తెస్తుంది:
తులసి పూజ తరువాత, నీరు సమర్పించిన అదే పాత్రలో తులసి ఆకులను ఉంచండి. ఇంట్లో అంతటా చల్లండి. ఇది ఇంటి శ్రేయస్సును కాపాడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీలు దరిచేరవు. ఇల్లు సుభిక్షంగా ఉంటుంది.
ఇలా చేయవద్దు:
ఆదివారం నాడు తులసికి నీరు సమర్పించవద్దు. నమస్కరించకుండా తులసి ఆకులను తీయకూడదు. సాయంత్రం పూట తులసి చెట్టును తాకవద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.. దీని కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది.