Site icon HashtagU Telugu

Saturday: శనివారం ఈ పనులు చేస్తే చాలు శని దేవుడి అనుగ్రహం కలగడం ఖాయం?

Mixcollage 05 Feb 2024 08 35 Pm 759

Mixcollage 05 Feb 2024 08 35 Pm 759

వారంలో శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. ఈరోజున శనిదేవున్ని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు కొన్ని రకాల దానధర్మాలు చేయడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. శని రాజునైన పేదవాడిగా చేయగలిగిన శక్తి వంతమైన గ్రహం. ఒక్కసారి శని దేవుడు మనపై ఆగ్రహిస్తే చాలు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్టే. అలాగే ఆయన అనుగ్రహం కలిగింది అంటే చాలు పేదవాడైనా రాజుగా మారాల్సిందే. అంతేకాదు శని సహనాన్ని, క్రమశిక్షణను నేర్పే గ్రహం. అటువంటి శని దేవుడిని జ్యోతిషశాస్త్రంలో చాలా దుష్ట గ్రహంగా పరిగణిస్తారు. ఆయన కన్ను ఎవరిపై పడితే వారు చెడ్డ రోజులు అనుభవించాల్సి వస్తుందని చెబుతారు.

అటువంటి శనిదేవుని శాంతింప చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని, శని దేవుడు ప్రసన్న మైతే జీవితంలో ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని చెబుతున్నారు. శని దేవుడు అనుగ్రహం కోసం శనివారం నాడు నల్ల దుస్తులు ధరించాలి. అలాగే ఆవనూనెను దానం చేస్తే మంచిది. ఆవనూనెను దానం చేసే సమయంలో అందులో ఒక నాణెం వేస్తే ఇంకా మంచిది. శనిదేవుడి ఆగ్రహం తగ్గాలంటే ఆయన అనుగ్రహం కావాలంటే శనివారం రోజు 1.25 కిలోల నల్ల మినుములు దానం చేస్తే మంచిది. ఇక శనివారం నాడు నల్లకుక్కకు రొట్టెలను తినిపించటం వల్ల శని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ప్రతి రోజూ 108 సార్లు శని దోష నివారణ మంత్రాన్ని చదివితే శని దోష నివారణ అవుతుంది.

ప్రతిరోజు ఓం శనైశ్చరాయ నమః అంటూ శని మంత్రాన్ని చదవడం వల్ల దోష నివారణ కలుగుతుంది. అంతే కాదు శనిదోషంతో బాధపడుతున్న వారు శని అనుగ్రహం కోసం ప్రతి రోజూ శివుడిని పూజించాలని శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయాలి. నల్ల ఆవును పూజించడం వల్ల కూడా శని శాంతిస్తాడు. ఇక శని దోషంతో బాధపడేవారు నిత్యం హనుమంతుడుని పూజించడం వల్ల కూడా శని దోష నివారణ జరుగుతుంది. అలాగే శనివారం రోజు శనిదేవుడిని పూజించి నల్ల నువ్వులను, నల్ల వస్త్రాన్ని, ఆవనూనెను ఆయనకు సమర్పిస్తే కూడా శని అనుగ్రహిస్తాడు. .