Vastu: చిన్న నిమ్మకాయ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది..ఎలాగో తెలుసుకోండి..!!

మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. కానీ వాటి గురించి అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలిస్తాయన్న విషయం తెలుస్తే.. ?

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 07:34 AM IST

మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. కానీ వాటి గురించి అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలిస్తాయన్న విషయం తెలుస్తే.. ? అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి..!! ఇది మన ఆహారానికి రుచిని అందించడమే కాదు..మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం..నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకుతుందట. నిమ్మకాయకు సంబంధించి నియమాలు, నివారణలను సరిగ్గా పాటించినట్లయితే…మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను తొలగిస్తుంది.

ధన లాభం కోసం:
మనపై…మన ఇంటిపై నజర్ ను తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ధనలాభం కోసం నిమ్మకాయను వాడుతుంటారు. మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగపరవచ్చు. మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లుయితే..నిమ్మకాయను ఇంటికి నాలుగు మూలల్లో 7 సార్లు తిప్పండి. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి…నాలుగు ముక్కలుగా చేసి నాలుగు దిక్కులకు ఒక నిమ్మకాయ ముక్కను వేయండి. ఇలా చేస్తే మీపై నజర్ పోతుంది. మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి.

నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే..:
మీ ఇంటి యజమానిపై నుంచి నిమ్మకాయను 7సార్లు తిప్పి రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఎడమ చేతి భాగాన్ని కుడివైపుకు, కుడి చేతి భాగాన్ని ఎడమవైపుకు తిప్పి విసిరేయండి. నిమ్మకాయపై నాలుగు లవంగాలు వేసి ఓ శ్రీ హనుమంతే నమ:అనే మంత్రాన్ని 108సార్లు జపించండి. ఈ పరిహారంతో మీపై ఉన్న చెడు పోతుంది. మీ పనులు పూర్తవుతాయి.

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి:
శనివారం నాడు నిమ్మకాయను తీసుకుని ఎవరైతే వ్యాధులతో బాధపడతున్నారో వారిపై నుంచి 7 సార్లు తిప్పి…ఆ నిమ్మకాయ మధ్య నుంచి కత్తితో తల నుంచి కాలి వరకు నెమ్మదిగా తిప్పాలి. సాయంత్రం రెండు ముక్కలను రెండు దిశలో వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం :
ఇంట్లో ఆనందం, శ్రేయస్సును పొందాలంటే నిమ్మకాయను తీసుకుని ఒక చౌరస్తాకు వెళ్లి దానిపై 7 సార్లు తిప్పి రెండు భాగాలుగా చేసి…ఒక భాగాన్ని వెనకకు, మరొక భాగాన్ని ముందుకు విసిరి వేయండి. వెనక్కు తిరిగి చూడకూండా వెళ్లిపోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పరార్ అవుతాయి. ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు నిమ్మకాయతో ఏదైనా పరిహారం చేస్తుంటే వెనక్కి తిరిగి చూడకండి. ఇలా చేస్తే మీరు చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదు.

నర ద్రుష్టి తొలగిపోవాలంటే:
నరద్రుష్టి పోవాలంటే నిమ్మకాయకు పచ్చిమిర్చితో మీ ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు.