మామూలుగా ప్రతి ఒక్కరూ కష్టపడి డబ్బు సంపాదించి ఉన్నతంగా ఉండాలని ఆర్థిక సమస్యలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మి అనుగ్రహం కలగాలని ఎన్నో పూజలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. కాని కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటివారు చేతిలో డబ్బులు మిగిలాలన్న తన లాభం పొందాలి అన్న అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ప్రతిరోజు కొన్ని పనులు చేయాలంటున్నారు పండితులు. అవేంటంటే..
ప్రతి రోజూ సాయంత్రం ఆవనూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. ఇలా రోజూ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పుకుండా లభిస్తాయి. కర్పూరం మంచి వాసనతో కూడిన శుభకరమైన పదార్థం. కర్పూరం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాగే వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో రోజూ కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు రాసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. ముక్కోటి దేవతలందరూ నివసించే జంతువుగా ఆవు పరిగణించబడుతుంది.
ఈ గోమాతకు రోజూ ఆహారం తినిపిస్తే చాలా మంచిది. ఒక్క ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్లు సంతృప్తి చెంది చల్లగా చూస్తాయి. జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ప్రతిరోజూ పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిదని భావిస్తారు. అలాగే ప్రతిరోజూ పక్షులకు ధాన్యాలు తినిపిస్తే, జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోగతి శ్రేయస్సు ఉంటుంది. అలాగే సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్వడం మానుకోవాలి. లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే. దీని వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావచ్చు. ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుంది.