Site icon HashtagU Telugu

Lakshmi Devi: రోజు ఇలా చేస్తే చాలు.. లక్ష్మి అనుగ్రహం కలగడం ఖాయం?

Mixcollage 22 Jul 2024 06 01 Pm 5408

Mixcollage 22 Jul 2024 06 01 Pm 5408

చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వకూడా మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. ఖర్చులు ఎంత తగ్గించుకున్నప్పటికీ డబ్బు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుందని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీ అనుగ్రహం మనపై తప్పకుండా ఉండాలి. మరి లక్ష్మి అనుగ్రహం కలగాలిఅంటే ప్రతి రోజు ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజూ సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి.

ఇలా ప్రతీ రోజూ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పుకుండా లభిస్తాయి. వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్యమైన పదార్థంగా వెలుగొందింది కర్పూరం. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. అలాగే వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో రోజూ కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు రాసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ముక్కోటి దేవతలందరూ నివసించే జంతువుగా ఆవు పరిగణించబడుతుంది. అలాంటి గోమాతకు రోజూ ఆహారం తినిపిస్తే చాలా మంచిది.

ఒక్క ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్లు సంతృప్తి చెంది చల్లగా చూస్తాయి. జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుందట. ప్రతిరోజూ పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిదని భావిస్తారు. అలాగే ప్రతిరోజూ పక్షులకు ధాన్యాలు తినిపిస్తే, జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయట. జీవితంలో మంచి పురోగతి శ్రేయస్సు ఉంటుందట. సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్వడం మానుకోవాలి. లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే. దీని వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావచ్చు. ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుందని చెబుతున్నారు పండితులు.