Rahu-Ketu: మామూలుగా చాలామంది రాహు కేతువు దోషాలతో బాధపడుతున్నాం అని అంటుంటారు. రాహు కేతువు దోషాల వల్ల అనేక సమస్యలు వస్తాయని, జీవితంలో కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతుంటారు. అయితే ఇలా రాహు,కేతు దోశలతో బాధపడేవారు నవగ్రహాలకు అలాగే రాహుకేతువులకు పూజ చేయిస్తూ ఉంటారు. వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే పనులు చేస్తే తప్పకుండా ఆ దోషాల నుంచి బయటపడవచ్చట. కాగా ఇంతకీ మొదట రాహు కేతు దోషం అంటే ఏమిటి? అన్న విషయానికి వస్తే.. రాహువు కేతువు ఛాయా గ్రహాలు. ఇవి నవగ్రహాలలో ముఖ్యమైనవి. ఒకరి జాతకంలో ఈ గ్రహాలు సరిగా లేని స్థానాల్లో ఉంటే, దానిని రాహు కేతు దోషం అంటారు.
ఈ దోషం వల్ల జీవితంలో అనేక అడ్డంకులు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, సంబంధాలలో గొడవలు వంటివి రావచ్చని నమ్మకం. కొన్ని నియమాలతో ఉపశమనం పొందవచ్చట. రాహు కేతు దోషాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, రోజువారీ ధ్యానం, యోగా లేదా ప్రార్థన చేయాలట..ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, స్పష్టతను పొందడానికి సహాయపడుతుందట. మీ జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుందని, రాహు కేతువుల దుష్ప్రభావాలను తగ్గించడానికి మంత్రాలు జపించడం ఒక ప్రభావవంతమైన మార్గం అని చెబుతున్నారు. “ఓం భ్రాం భ్రీం భ్రౌం సః రాహవే నమః” లేదా “ఓం కేతవే నమః ” వంటి మంత్రాలను జపించడం ద్వారా రాహు, కేతువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చని చెబుతున్నారు.
అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయట. ఇది పితృ దోషాలను కూడా తగ్గిస్తుందని, పితృ దోషాలు కూడా రాహు కేతు దోషాలతో ముడిపడి ఉంటాయని నమ్మకం. ఈ రోజున పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, అన్నం, నువ్వులు, బెల్లం, నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం శుభప్రదం అని చెబుతున్నారు. రాహువు, కేతువులను శాంతింపజేయడానికి శివుడు, హనుమంతుడు, లేదా ఇతర ఇష్ట దైవాలను పూజించాలట. శివసహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా వంటి వాటిని పఠించడం వల్ల రాహు కేతువుల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చని చెబుతున్నారు. రాహు కేతు దోష నివారణకు అమావాస్య రోజున దానధర్మాలు చేయడం మంచిదట. పేదలకు, అవసరమైనవారికి సహాయం చేయడం వల్ల కూడా దోషాల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు పండితులు. రాహు కేతు పూజ చేయడానికి సరైన సమయం, ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా ముఖ్యం అని చెబుతున్నారు. రాహు కేతు దోష నివారణకు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో రాహు కేతు పూజ చేయడం వల్ల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం.
Rahu-Ketu: రాహువు, కేతువు దోషాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ పనులు చేయాల్సిందే!
Rahu-Ketu: రాహు, కేతువు దోషాలతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పనులు చేస్తే ఆ దోషాలు ఖాతం అయినట్లే అని చెబుతున్నారు పండితులు. మరి రాహు కేతువు దోషాలను ఎలా నివారించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Rahu Ketu
Last Updated: 15 Dec 2025, 05:54 AM IST