Site icon HashtagU Telugu

Sunday: ఆదివారం రోజు ఇలా చేస్తే చాలు మీ సంపద అమాంతం పెరగడం ఖాయం?

Mixcollage 22 Jun 2024 11 02 Am 8998

Mixcollage 22 Jun 2024 11 02 Am 8998

హిందూమతం ప్రకారం ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్య భగవానున్ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అంతా మంచి జరగడంతో పాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. కాగా జ్యోతిష్య శాస్త్రం ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు సింహ రాశి పాలక గ్రహం అయిన సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. మీ జాతకంలో సూర్యుడు శక్తివంతమైన స్థానంలో ఉన్నప్పుడు మీ జీవితంలో కీర్తి, సంపద, ఆనందం పొందుతారు. అంతేకాదు మీరు అనుకున్న పనులను కూడా పూర్తిచేయగలుగుతారు.

అలాగే జీవితంలో విజయం సాధిస్తారు. ఇవన్నీ జరగాలి అంటే ఆదివారం రోజు తప్పకుండా కొన్ని రకాల నియమాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఆదివారం రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎరుపు రంగు దుస్తులు అంటే సూర్య భగవానుడికి ఇష్టం. కాబట్టి ఆదివారం రోజు మీ అదృష్టం పెరగడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఆదివారం రోజు మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్తుంటే నుదుటికీ ఖచ్చితంగా గంధపు తిలకాన్ని పెట్టుకోండి. ఇలా నుదుటి మీద గంధపు తిలకాన్ని పెట్టుకొని వెళ్లడం వల్ల మీరు వెళ్లే పనిలో విజయం సాధించవచ్చు.

ఆదివారం రోజు అవసరమైన వారికి మీరు బియ్యం పాలు బెల్లం బట్టలు వంటివి దానం చేయడం చాలా మంచిది. వీటిని దానం చేయడం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహం పొందవచ్చు. అంతేకాదు మీరు చేపట్టిన పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. విజయం సాధిస్తారు. అలాగే మీ సంపద పెరుగుతుంది. ఇంట్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. అదేవిధంగా ఆదివారం రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం ను సమర్పించాలి. అయితే మీరు అర్ఘ్యం చేసేటప్పుడు ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్య నమః అనే మంత్రాలను పఠించాలి. ఆదివారం రోజు గాయత్రి మంత్రాలను పట్టించడం వల్ల కూడా సూర్య భగవానుడు అనుగ్రహం కలుగుతుంది. ఆదివారం ఈ మంత్రాన్ని పఠిస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుటుంది. మీ ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆదివారం రోజు ఈ విధంగా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడంతో పాటు మీ సంపద కూడా పెరుగుతుంది.

Exit mobile version