Site icon HashtagU Telugu

Sravana Masam 2024: శ్రావణ శనివారం రోజు ఇలా చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!

Sravana Masam 2024

Sravana Masam 2024

ప్రస్తుతం శ్రావణమాసం అన్న విషయం మనందరికీ తెలిసిందే. శ్రావణ మాసంలో ఎన్నో రకాల పండుగలు జరుపుకుంటూ ఉంటారు. నాగుల చవితి,వరలక్ష్మి వ్రతం,,మహాలక్ష్మి పూజ ఇలా ఎన్నో రకాల పూజలు కూడా చేస్తుంటారు. అందుకే స్త్రీలు ఎక్కువగా శ్రావణమాసాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇక శ్రావణ మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రావణ మాసంలోనే అనేక కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాకుండా సోమ, మంగళ, శని వారాలను కూడా చేస్తూ ఉంటారు.

అదేవిధంగా శ్రావణమాసంలో శనివారం కూడా కొన్ని రకాల పనులు చేస్తే చాలు అంతా మంచి జరుగుతుంది అంటున్నారు పండితులు. మరి శ్రావణ మాసంలో శనివారం రోజు ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శ్రావణ మాసం అనేది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. అందులోనూ విష్ణు దేవుడి నక్షత్రం శ్రావణం. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిస్తే తమ కోరికలను నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని చెబుతారు. పులిహోర, లడ్డూ ప్రసాదాలను విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం.

కాబట్టి ప్రసాదాలు తయారు చేసి నివేదన చేయాలి. ఈ మాసంలో విష్ణు మూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏలినాటి శని, అర్థష్టమ, సాడేసాతి శని ప్రభావం వంటివి తొలగుతాయి. అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే శనివారం గోమాతను పూజిస్తే మరింత మంచి జరుగుతుందట. అదేవిధంగా శనివారం రోజున వస్త్ర దానం, అన్నదానం, నవ ధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిదని చెబుతున్నారు. అలాగే నల్లని వస్తువులు దానం చేసినా మంచిదట. శనివారం రోజున ఇంటికి ఇనుము, ఉప్పు, కొత్త చెప్పులు, నూనె, నల్లని బట్టలు వంటివి ఇంటికి తెచ్చుకోకూడదని అలా తెచ్చుకుంటే లేనిపోని సమస్యలను ఏరి కోరి మరి తెచ్చుకున్నట్టే అంటున్నారు పండితులు. కాబట్టి శ్రావణ శనివారం రోజు పొరపాటున కూడా పైన చెప్పిన వస్తువులు అసలు ఇంటికి తెచ్చుకోకండి.