ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూనే అన్నారు. ఎంత డబ్బు సంపాదించిన చేతిలో డబ్బులు మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. ఇక ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించమని ఎంతో మంది దేవుళ్లను వేడుకుంటూ ప్రత్యేకంగా పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా డబ్బు సమస్యలతో సతమతమవుతున్నారా. అయితే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలంటే మంగళవారం రోజు కొన్ని రకాల పనులు చేయాలని చెబుతున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. ఈ రోజు ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే ఈ దేవుడి అనుగ్రహంతో పాటుగా శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. మంగళ దోషం తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయాన్నే స్నానం చేయాలి. ఆ తర్వాత హనుమంతుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే రామ భక్తులకు ప్రసాదాన్ని పెట్టాలి. ఇలా వరుసగా ఏడు మంగళవారాలు చేస్తే మంగళ దోష ప్రభావం తగ్గుతుందట. ఇక హనుమంతుని అనుగ్రహం కలగాలి అనుకున్న వారు, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకున్న వారు ప్రతి మంగళవారం నాడు ఏడు సార్లు హనుమాన్ చాలీసాను పటించాలట.
ఇలా చేస్తే ఆంజనేయ స్వామి సంతోషపడతాడట. అంతేకాదు వీళ్లపై ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట. పేదరికం, డబ్బు సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మంగళవారం రోజు కోతులకు బెల్లం, శనగలు తినిపించాలని చెబుతున్నారు. ఒకవేళ ఇది మీకు వీలు కాకపోతే అవసరమైన వారికి ఆహారాన్ని పెపెట్టాలి. ఇలా వరుసగా 11 మంగళవారాలు చేయడం వల్ల శాశ్వతంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అలాగే ఏదో ఒక మంగళవారం నాడు బార్లీ పిండిలో నల్ల నువ్వులు, ఆవనూనె కలిపి రొట్టె తయారు చేయాలి. ఈ రొట్టెను తలచుట్టూ ఏడు సార్లు తిప్పి గేదెకు తినిపించాలి. ఇది కంటిచూపు చెడు ప్రభావాన్ని వెంటనే తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.