సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజున పరమేశ్వరున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందట. ఈ రోజున శివుడితో పాటుగా పార్వతీ దేవిని పూజిస్తారు. అలాగే ఉపవాసం ఉంటారు. వీరిని నిష్టగా పూజిస్తే జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం. శివుడు తన అనుగ్రహంతో భక్తులను రక్షిస్తాడని నమ్మకం. ముఖ్యంగా సోమవారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందట. ఇంట్లో తరచూ గొడవలు పోట్లాటలు జరుగుతుంటే సోమవారం రోజు ఉదయం స్నానం చేసి ధ్యానం చేసి తర్వాత పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజించాలట.
ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న రోజ్ వుడ్ చెట్టు దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించాలట. ఇలా చేస్తే కుటుంబంలో కలహాలు తగ్గుతాయని చెబుతున్నారు. పెళ్లి కాని వారు సోమవారం రోజు స్నానం చేసి తెల్లని దుస్తులు ధరించాలి. తరువాత నీళ్లలో పాలు పోసి పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. రాహు కేతువుతో సహా అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గించడానికి మీరు నల్ల నువ్వులను నీటిలో కలపవచ్చు. దేవుడి కోసం తెచ్చిన తెల్లని బట్టలను దేవుడికి సమర్పించాలి. శివుని ప్రసన్నం చేసుకోవడానికి భాంగ్, ధతుర, మదార పూలు మొదలైన వాటిని సమర్పించడం మంచిది.
ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయట. మీ వైవాహిక జీవితం సంతోషంగా లేకపోతే సోమవారం శివుడికి పంచా మృతంతో అభిషేకం చేయలట. ఆ తర్వాత పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయ తో పాటు ఓం బ్రహ్మ్ భృన్ స: రహవే నమః అనే మంత్రాన్ని పఠించాలట.