Site icon HashtagU Telugu

Thursday: గురువారం రోజు ఈ పనులు చేస్తే చాలు డబ్బుకు కొరతే ఉండదట!

Thursday

Thursday

హిందువులు గురువారం రోజు చాలామంది దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. కొందరు గురువారం రోజు సాయిబాబాని పూజిస్తే మరికొందరు దత్తాత్రేయ స్వామిని మరికొందరు మహావిష్ణువును పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అలాగే శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా గురువారం పూజిస్తూ ఉంటారు. ఈ రోజున దేవగురువు బృహస్పతిని కూడా పూజిస్తూ ఉంటారు. గురువారం నాడు శ్రీవిష్ణువును పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు వృత్తి, వ్యాపారాలు చేసేవారు కూడా మంచి లాభాలను పొందుతారట. అనుకున్న పనులు నెరవేరుతాయి.

గురువారం నాడు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మరి గురువారం రోజు ఎలాంటి పనులు చేయాలి అన్న విషయానికి వస్తే.. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి మీరు గురువారం నాడు తలస్నానం చేసి ధ్యానం చేయాలి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి ముందుగా భాస్కరుడికి నీళ్లు సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీ నారాయణుడికి పూజ చేయాలి. అయితే పూజ సమయంలో విష్ణుమూర్తికి అష్టదళ తామరను సమర్పించాలని పూజారులు చెబుతున్నారు. దీనివల్ల మీరు విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చట. దీంతో మీరు కోరుకున్న పనులను పూర్తి చేస్తారట. మీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేకపోతే గురువారం పూజ సమయంలో శ్రీవిష్ణువుకు కొబ్బరికాయను సమర్పించాలట.

అలాగే దేవుడికి మొక్కుతూ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకోవాలట. తర్వాత కొబ్బరికాయను ఎరుపు లేదా పసుపు వస్త్రంలో చుట్టి సురక్షితంగా పెట్టాలట. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే గురువారం నాడు తలస్నానం చేసిన తర్వాత కాసేపు ధ్యానం చేసి,ఆ తర్వాత ఆచారాలతో శ్రీమహావిష్ణువును పూజించాలట. పూజసమయంలో విష్ణుమూర్తికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. ఈ పరిహారం వల్ల దేవుడి అనుగ్రహం పొందుతారు. దీంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. మీ వృత్తి లేదా వ్యాపారంలో మంచి లాభాలను పొందడానికి, సమస్యలను పోగొట్టాలంటే గురువారం నాడు మీ సమీపంలోని లక్ష్మీ నారాయణ ఆలయాన్ని సందర్శించాలట. అలాగే శ్రీవిష్ణువును పూజించాలట. అలాగే లక్ష్మీదేవికి, సంపదకు అధిదేవత అయిన విష్ణుమూర్తికి 7 పసుపు ముద్దలను సమర్పించాలట. ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుందని, మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు..