Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2025 తేదీ, సమయం ఏకాదశి తిధి డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 కి మొదలవుతుందట. డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 తో ముగుస్తుందట. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి. కనుక వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలట. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారు జామున 3:30 నుంచి వైష్ణవాలయాల్లో ద్వారదర్శనాలు మొదలవుతాయని చెబుతున్నారు.
ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాల విషయానికి వస్తే.. వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఉపవాసం. ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలట. సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా విష్ణు భక్తికి ప్రతీక జాగారం. వైకుంఠ ఏకాదశి నాటి రాత్రి నారాయణ నామ సంకీర్తనతో, భజనలతో, భాగవత కథా కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వలన మోక్షాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
కాగా ఈరోజున శ్రీమహావిష్ణువును అష్టోత్తర శతనామాలతో అర్చించాలట. విష్ణువుకు ప్రీతికరమైన పసుపు రంగు పువ్వులను, తులసి మాలను సమర్పించాలట. పులిహోర, చక్రపొంగలి నైవేద్యంగా సమర్పించాలని,విష్ణు సహస్రనామ పారాయణ చేయాలని, అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం వలన మోక్షం సిద్ధిస్తుందని చెబుతున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు వస్త్రదానం. సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుందట. అలాగే ఈ రోజు తులసి మొక్కను దానంగా ఇవ్వడం కూడా శుభప్రదం అని చెబుతున్నారు. కాగా ఈ రోజు ఎన్ని ఎక్కువసార్లు వీలయితే అన్నిసార్లు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కానీ జై శ్రీమన్నారాయణ అనే మంత్రాన్ని కానీ జపిస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు.
