వారంలో మంగళవారం ఈరోజు ఆంజనేయస్వామికి అంకితం చేయబడింది. కొందరు మంగళవారం ఆంజనేయస్వామి పూజిస్తే మరికొందరు శనివారం కూడా ఆంజనేయస్వామిని పూజిస్తూ ఉంటారు. అయితే హనుమంతుని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మంగళవారం నాడు కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులను పొందవచ్చు. అలాగే మీ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు, పురోగతి పొందుతారు. మరి ఇందుకోసం మంగళవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలా రోజులుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మంగళవారం రోజు హనుమంతుడిని పూజించడం మంచిది. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి. మాములుగా కొందరి జాతకంలో మంగళ దోషం ఉంటుంది. ఈ దోషం పోవాలి అనుకున్నవారు నివారణ కోసం ఎండు మిరపకాయలను దానం చేయాలి. మంగళవారం నాడు ఎర్ర మిరపకాయలను దానం చేయడం వల్ల మంగళ దోష ప్రభావం తగ్గుతుంది. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మంగళవారం శ్రీరాముడితో పాటుగా హనుమంతుడిని కూడా ఆరాధించాలి.
అలాగే ఆరాధన సమయంలో రామ రక్షా స్తోత్రాన్ని పఠించాలి. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మీ బాధలు, పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా హనుమంతుడి అనుగ్రహం పొందాలనుకుంటే మంగళవారం రోజు తల స్నానం చేసి ఎర్రటి దుస్తులను దరించాలి. ఆ తర్వాత హనుమంతుడిని పూలతో పూజించాలి. అయితే హనుమంతుడికి ఎరుపు రంగు పండ్లు, పువ్వులను మాత్రమే సమర్పించాలి. అలాగే కుంకుమపువ్వును కూడా హనుమంతుడికి సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు అప్పులను అసలే ఇవ్వకూడదు. అందుకే మంగళవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. అలాగే మీరు కూడా ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.