వారంలో ఒకొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అందులో సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. అందుకే సోమవారం రోజు ఆ పరమశివునికి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. వారంలో మిగతా రోజులతో పోల్చుకుంటే సోమవారం రోజు శివుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సోమవారం రోజు ఉపవాసం ఉండి పరమేశ్వరున్ని పూజిస్తే ప్రతి పనిలో విజయం సాధించవచ్చు అని నమ్ముతూ ఉంటారు. అయితే సోమవారం నాడు పరమేశ్వరుని పూజించేటప్పుడు కొన్ని రకాల పరిహారాలు పాటించడం మంచిది అంటున్నారు పండితులు.
మరి ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీవితంలో ఇబ్బందులు లేని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారు. మీరు కష్టాల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే సోమవారం రోజు శివుడిని ఖచ్చితంగా పూజించాల్సిందే. అలాగే పూజా సమయంలో పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ప్రతి సోమవారం నాడు ఇలా తప్పకుండా చేస్తే మీ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు సోమవారం రోజు తల స్నానం చేసి ధ్యానం చేయాలి. అలాగే గంగా జలంలో బార్లీ ని కలిపి శివుడికి అభిషేకం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఆదాయం అదృష్టం రెండు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా మీరు చాలా కాలంగా అప్పుల బాధతో సతమతమవుతుంటే.. ప్రతి సోమవారం నాడు గంగాజలంతో శివుడికి అభిషేకం చేయాలి. అలాగే తెల్లని వస్త్రాలను పరమేశ్వరుడికి సమర్పించాలి. పైన చెప్పిన పరిహారాలు సోమవారం రోజు పాటించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.