మీరు కూడా అప్పుల బాధలతో సతమతమవుతున్నారా, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టిగ లేకపోతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక ఇబ్బందులు తీరడం లేదా? అయితే ఇలా చేయాల్సింది అంటున్నారు పండితులు. అప్పుల నుంచి బయటపడడానికే కార్తీకమాసంలో కందుల దీపం పెడితే మంచిదట. మరీ ఈ దీపం ఎలా పెట్టాలి? అందుకోసం ఎలాంటి నియమాలను పాటించాలి అన్న విషయానికి వస్తే.. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో శివ అలాగే శ్రీమహావిష్ణువు ఆలయాలు దీప కాంతులతో వెలిగిపోతున్నాయి.
ఈ కార్తిక మాసంలో అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో కందుల దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. మంగళవారం నాడు కందుల దీపాన్ని కార్తీకమాసంలో వెలిగిస్తే రుణ బాధల నుంచి గట్టెక్కవచ్చట. ఇంటిని శుభ్రం చేసుకుని శుభ్రంగా స్నానం చేసి పూజగదిని కూడా అందంగా అలంకరించుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం తీసుకుని బొట్లు పెట్టాలి ఫోటో ఎదురుగా మీరు ఒక పీఠ వేసి పసుపు రాయాలి. దానిపై బొట్లు పెట్టాలి. తర్వాత ఆ పీఠం మీద బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఒక పళ్లెంలో కేజీ ఎర్ర కందిపప్పు పోయాలి.
రెండు ప్రమిదలకి బొట్లు పెట్టి ఆ కందిపప్పు పై వాటిని పెట్టి నువ్వుల నూనె పోసి ఎర్ర వత్తులు వేయాలి. 9 వత్తులు తీసుకుని ఒక వత్తి కింద చేయాలి. ఒకవేళ ఎర్రని వత్తులు మీకు దొరకకపోతే మామూలు వత్తులకి కుంకుమ రాయాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ కందులని నానబెట్టి అందులో బెల్లం కలిపి గోమాతకి పెట్టాలి. లేకపోతే మీరు వీటిని ఎవరికైనా ఇచ్చేయవచ్చు. ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కచ్చట.