Lakshmi devi: ఆర్థిక నష్టాలు తొలగిపోవాలా.. అయితే ఈ ఐదు పనులు చేయాల్సిందే?

మనిషి జీవితంలో నిరంతరం డబ్బు కోసం శ్రమిస్తూనే ఉంటాడు. డబ్బు సంపాదించాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఆర్థిక

  • Written By:
  • Publish Date - February 23, 2023 / 06:00 AM IST

మనిషి జీవితంలో నిరంతరం డబ్బు కోసం శ్రమిస్తూనే ఉంటాడు. డబ్బు సంపాదించాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఆర్థిక సమస్యలు ఉండకూడదు. ఉన్నత స్థానాలకు వెళ్లాలి అని రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో అయితే డబ్బు లేనిది ఏ సమస్య కూడా పరిష్కారం అవ్వదు అన్న స్థితికి వచ్చేసింది. సమాజంలో డబ్బు లేకపోతే చాలామంది చిన్నచూపు చూస్తుంటారు. మన అనుకున్న వాడే డబ్బులు లేకపోతే కనీసం పలకరించడం కూడా రావడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అయితే కొందరు ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు.

సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు కూడా చేస్తున్నామని బాధపడుతూ అంటారు. అయితే చాలామంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపరుచుకోవడం కోసం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు ఎన్నో రకాల వాస్తు చిట్కాలను వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. మరి అందుకోసమే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుంటాం.. డబ్బు స్థిరంగా ఉండాలి అంటే.. జోతిష్యశాస్త్రం ప్రకారం డబ్బు స్థిరంగా నిలవాలంటే ఈ ఐదు నియమాలను తూచ తప్పకుండా పాటించాలి. అప్పుడు లక్ష్మి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందుకోసం మీ ఇంట్లో ఒక తులసి మొక్కను నాటాలి. హిందూ ధర్మంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదం.

ఇది ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా గురువారం రోజున ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. సంపద,శ్రేయస్సుకు మరోరూపంగా కొలిచే లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం వల్ల వారికి ఆర్థిక సమస్యలు దరిచేరవు. అదేవిధంగా ప్రతిరోజూ పూజ గదిలో దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగుతాయి. అలాగే ఇక ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేయడం బెల్లము, అక్షత, పాలు సమర్పిస్తే మీ కోరికలను ఆ భోళా శంకరుడు తప్పకుండా నేరవేరుస్తాడు. ఇక పౌర్ణమి నాడు చంద్రుడిని పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయట.