Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఆ మూడు రకాల వ్యక్తులను గౌరవించాల్సిందే?

Lakshmi Devi

Lakshmi Devi

సాధారణంగా చాలామంది ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులు చేతిలో మిగడం లేదని బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా సంపాదించిన డబ్బులు మిగలకపోగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడటంతో పాటు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఇదే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది ఎన్నో రకాల పూజలు, వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు.

వాస్తు విషయాలను పాటించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా వాస్తు చిట్కాలను పాటించడంతోపాటు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి. ఇందులో ముఖ్యంగా కొంతమంది ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తప్పుగా ప్రవర్తిస్తూ నోటి దురుసుతో మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారికి లక్ష్మి అనుగ్రహం ఎప్పటికీ లభించదు. అహంభావంతో, అహంకారంతో ఉండే వ్యక్తులు తమకంటే బలహీనమైన వ్యక్తిత్వం ఉన్న వారిని వేధిస్తూ ఉంటారు. అలాగే మంచి స్థానంలో ఉన్నవారు వాళ్ళ కంటే బలహీనులను పొరపాటున వేధించకూడదు. అలాంటి వారికీ లక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది.

అలాగే ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసే వారిని గౌరవించాలి. అలా ఇష్టపడి పనిచేసే వారిని గౌరవించని వ్యక్తులపై లక్ష్మి దేవి అనుగ్రహం కలగదు. ఎంత డబ్బు ఉన్నా కూడా మనతోపాటు కష్టపడి పనిచేసే వారిని అగౌరపరచకూడదు.
అలాగే స్త్రీలను మన దేశంలో దేవతల పూజిస్తారు. స్ట్రీలకు అత్యంత విశిష్ట స్థానం ఉంది కాబట్టి ఎవరైనా సరే స్త్రీలను గౌరవించాలి. వాళ్లతో తప్పుగా ప్రవర్తించ కూడదు. అలా తప్పుగా ప్రవర్తించే వారిపై లక్ష్మీ అనుగ్రహం కలగకపోగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.