Shani Nivaran: శనిదోషం పోవాలంటే రావి చెట్టుకు ఈ పూజలు చెయ్యండి!

Shani Nivaran: సాధారణంగా చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. మరికొందరు మాత్రం శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Shani Dev

Shani Dev

Shani Nivaran: సాధారణంగా చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. మరికొందరు మాత్రం శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆ శని దేవుని అనుగ్రహం లభించి సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తూ ఉంటారు. అయితే శని దోషం పోవడానికి అనేక రకాల పూజలు దానధర్మాలు నిర్వహిస్తూ ఉంటారు. కొందరు శని దేవునికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులు నల్ల బట్టలు దానం చేస్తూ ఉంటారు. అలాగే కొందరు వారికి తోచిన విధంగా ఆహారం, వస్తువు, డబ్బులు సహాయం చేస్తూ ఉంటారు.

అయితే వీటితోపాటుగా శని దోషం పోవాలి అంటే రావి చెట్టుకు కొన్ని రకాల పూజలు నిర్వహించాలి. మరి రావి చెట్టుకు ఏ రోజున ఎటువంటి పూజలు నిర్వహించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పితృ, శని దోషం పోవాలంటే శనివారం రోజున పాలలో బెల్లం కలిపి రావి చెట్టుకు పెట్టండి. దాంతో పాటుగా శం శనిశారాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించాలి. ఈ విధంగా చేయడం వల్ల శని దోషం శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

రావిచెట్టులో అనేక దేవతలు కొలువై ఉంటారని విశ్వసిస్తుంటారు. కాబట్టి రావి చెట్టును పూజించడం వల్ల అనేక రకాల దోషాలు తొలగిపోయి దేవతల అనుగ్రహాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. శనిదోషం పోవాలంటే రావిచెట్టును పూజించాలి. దీంతో పాటుగా శని దోష నివారణకు మంగళవారం రోజు రావిచెట్టు లోని పదకొండు ఆకులను తీసుకుని గంగాజలంతో శుద్ధి చేసి, ఆకులపై కుంకుమతో శ్రీరామ అని రాసి మాల కట్టాలి. ఆ తరువాత హనుమాన్ ఆలయానికి వెళ్ళి రావి ఆకుల మాల చేసిన మాల సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల శని దోషం పోతుంది.

  Last Updated: 23 Oct 2022, 01:42 AM IST