Site icon HashtagU Telugu

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ రంగులు కోపాన్ని తెప్పిస్తాయ్.. అవి ఉంటే ఎంతో ప్రమాదం?

Vastu

Vastu

మనుషులు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండరు. ఒకరితో మరొకరిని పోల్చుకున్నప్పుడు ఎప్పుడూ కూడా భిన్నంగానే ఉంటారు. కొందరు ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తే మరి కొందరు మాత్రం ఎప్పుడూ కోపంగా చిరాకుగా కనిపిస్తూ ఉంటారు. అయితే కోపం ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే ఈ కోపానికి వారి వ్యక్తిగత విషయాలతో పాటుగా, వాస్తు పరిస్థితులు కూడా అందుకు కారణం అవుతాయి అని అంటున్నారు వాస్తు పండితులు. ఇదే వాస్తు శాస్త్ర ప్రకారంగా వీటికి నివారణలు కూడా ఉన్నాయట. అయితే వాస్తును ఉపయోగించి కోపాన్ని ఎలా నియంత్రించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం..

సాధారణంగా ఎరుపు రంగు కు కోపానికి సంబంధం ఉంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఎరుపు రంగును ఇంట్లో లేకుండా చూసుకోవాలి. వీలైనంతవరకు ఇంటిలో ఎరుపు రంగుకు బదులుగా ఇతర రంగులను ఉపయోగించేలా చూసుకోవాలి. ఎరుపు రంగు కోపాన్ని మరింత ప్రేరేపిస్తుంది. అందుకే ఎరుపు రంగుకు బదులుగా ప్రశాంతతను కలిగించే.. నీలి రంగు, లేత ఆకురంగులను వేయాలి. అలాగే మన కోపానికి ఇంట్లో ఉండే ఫర్నిచర్ ప్లేస్మెంట్ కూడా ఒకరకంగా కారణం అని చెప్పవచ్చు.

ఇంట్లో ఫర్నిచర్ ను ఏర్పాటు చేసే ప్లేస్ కూడా కోపాన్ని ప్రేరేపిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఫర్నీచర్ పెట్టే ప్లేసుల్లోమురికి లేకుండా చూసుకోవాలి. ఇక మూడవది మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మన ఇంట్లో అద్దం పెట్టే స్థలం కూడా సరైన ప్లేస్ లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి మనం అద్దంలో ఆ రంగులను చూడటం వల్ల ఆ ప్రభావం మనపై కూడా ఉంటుంది. ఇంట్లో లైటింగ్ సిస్టమ్ ను ఇంటి అంతటా లైటింగ్ ఏర్పాటు చేయాలి. కోపాన్ని చెదరగొట్టడంలో లైటింగ్ ప్రభావ వంతంగా ఉంటుంది.