Site icon HashtagU Telugu

Astro Tips: వీటిని పొరపాటున కూడా ముట్టొద్దు.. దాటొద్దు

Whatsapp Image 2023 01 22 At 19.44.18

Whatsapp Image 2023 01 22 At 19.44.18

Astro Tips: ఈ రోజుల్లో ప్రజలు చేతబడిని నమ్మరు. ఇవన్నీ మూఢ నమ్మకాలే అని చెబుతారు. అలా అని  దారిలో పడి ఉన్న కొన్ని వస్తువులపై అడుగు పెట్టకూడదు. వాటిని చేతితో తీయకూడదు. వాటిని తాకితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే రోడ్డుపై పడి ఉన్న వస్తువులను ఎప్పుడూ తాకకూడదని అంటారు. రోడ్డుపై నడిచేటప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వస్తువులపై పొరపాటున కూడా అడుగు పెట్టకూడదు. చాలా సార్లు కొన్ని ట్రిక్స్ ద్వారా ఆ వస్తువులను రోడ్డు పక్కన ఉంచుతారు. వాటిపై అడుగు పెట్టడం శుభపరిణామంగా పరిగణించబడదు. రోడ్డుపై ట్రిక్స్ తో పడేసే ఆ వస్తువులు ఏమిటో వాస్తు శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం..

* జుట్టు గుత్తులు

దారిలో తరచుగా వెంట్రుకల గుత్తులు పడి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. వెంట్రుకలను చూడటం అశుభం. వెంట్రుకల కుచ్చుల వల్ల రాహువు ప్రభావితమవుతాడని నమ్ముతారు. అందుకే వాటి పై నుంచి వెళ్లకూడదు. వాటిని తాకకూడదు. దీనివల్ల జీవితంలో కూడా సమస్యలు తలెత్తుతాయి.

* నిమ్మకాయ మరియు మిరపకాయ

రోడ్డుపైన వెళ్తుంటే దారిలో నిమ్మకాయ, మిరపకాయలు పడి ఉన్నాయంటే.. దూరం జరిగి నడిచి వెళ్ళాలి.  అయితే వాటిని తాకకూడదు. ఎవరైనా చేతబడి చేసి… ఆ నిమ్మకాయలు, మిరపకాయలు రోడ్డుపై పడేసి ఉండొచ్చు. దుష్ట శక్తిని పారద్రోలేందుకు ప్రజలు తరచుగా ఇంటి వెలుపల, దుకాణాల వెలుపల కూడా నిమ్మకాయ, మిరపకాయలని వేలాడదీస్తారు.

* పూజా సామగ్రి, ఆహారం

తరచుగా పూజా సామగ్రి లేదా ఆహారాన్ని కూడలిలో ఉంచుతారు. నిజానికి పూర్వీకులకు ఆహారం పెట్టాలనే నిబంధన ఉంది. ఇందులో భాగంగానే కూడలిలో ఆహారాన్ని వేస్తుంటారు.చౌరస్తాలలో ఇటువంటివి పెడతారు.  అందుకే చౌరస్తాలలో పడి ఉండే వస్తువులకి, పూజా సామాగ్రికి దూరంగా నడిచి వెళ్ళండి.

* బర్న్డ్ వుడ్స్

బూడిద లేదా కాలిన కలపను రోడ్డుపై ఉంచితే దాన్ని దాటకూడదు. ఇది ప్రతికూల శక్తిని కూడా విడుదల చేస్తుంది. ఇది దాటిన వ్యక్తి ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది.

* చనిపోయిన జంతువులు

దారిలో ఎక్కడైనా చనిపోయిన జంతువు కనిపిస్తే.. అది కనిపించిన వెంటనే దిశ మార్చుకోవాలని చాలామంది నమ్ముతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోయిన జంతువును దాటకూడదు. దాని మీదుగా వాహనం కూడా నడపకూడదు. జంతువు యొక్క మృతదేహాన్ని దాటడం ద్వారా ప్రతికూల శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇది మీ జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది.

Exit mobile version