Site icon HashtagU Telugu

Tulasi Plant: తులసి మొక్కను ఈ రెండు రోజులు అసలు తాకకండి.. తాకారో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం!

Tulasi Plant

Tulasi Plant

హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క హిందువు ఇంటిదగ్గర తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది. విశేష రోజుల్లో తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో విష్ణువు అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారని, కాబట్టి తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి విష్ణువు అనుగ్రహం అలాగే తులసి దేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులను నమ్ముతూ ఉంటారు. అయితే తులసి మొక్కను పూజించడం మంచిదే కానీ చాలామంది తులసి మొక్క విషయంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు.

వాటి వల్ల తులసి దీనికి ఆగ్రహం తెప్పించడంతో పాటుగా మనం లేనిపోని కష్టాలను ఏరికోరి మరి తెచ్చుకున్నట్టే అంటున్నారు పండితులు. ముఖ్యంగా తులసి మొక్కను ప్రత్యేకించి రెండు రోజులలో అస్సలు ముట్టుకోకూడదట. ఆ రోజుల్లో ముట్టుకుంటే లేనిపోని కష్టాలు వస్తాయని అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం అంటున్నారు పండితులు. ఆ రెండు రోజులు ఏవి ? ఎందుకు ముట్టుకోకూడదు అన్న విషయానికి వస్తే.. తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ తగ్గిపోతుంది. ఆ ఇంట్లో ఉన్నవారు కూడా ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడతారు. కెరీర్‌ లో కూడా సక్సెస్‌ సాధిస్తారు. సైన్స్‌ పరంగా కూడా తులసి మొక్క ఇంటి దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లోకి దోమలు, ఇతర కీటకాలు రావు.

వాస్తు ప్రకారం మాత్రమే తులసి చెట్టును ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుని తులసి మొక్కను పెట్టుకుని పూజిస్తే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఇకపోతే తులసి మొక్కను ఏకాదశి అలాగే ఆదివారం రోజు ఎట్టి పరిస్థితులలో తాగకూడదని చెబుతున్నారు. ఈ రెండు రోజులు తులసి మాతకు నీరు కూడా పెట్టకూడదు అశుభం. ఎందుకంటే ఈ రోజుల్లో తులసి అమ్మవారు ఉపవాసం ఉంటారు. విష్ణువు కోసం ఈ రెండు రోజులు ఆమె ఉపవాసం పాటిస్తారు కాబట్టి ఈ రోజు ఆమెకు నీరు పెడితే ఆగ్రహిస్తుంది. పొరపాటున కూడా తాకకుండా జాగ్రత్త వహించాలి. పొరపాటున కూడా మనం నీరు వస్తే తులసీదేవి ఉపవాసాన్ని చెడగొట్టినట్టు అవుతుంది. ఇలా చేయడం వల్ల తులసి మాత ఆగ్రహించి వారి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని అంటారు. అంతేకాదు తులసి మొక్కకు నీరు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి, పగలు నీరు పోయకూడదు. కేవలం ఉదయం మాత్రమే నీరు పోయాలన్న ఒక విషయం గుర్తుంచుకోవాలి.