Shani Dosha: ఈ వస్తువులను ఇతరుల నుంచి అస్సలు తీసుకోకూడదు.. తీసుకుంటే శని పట్టినట్టే?

చాలామంది సొంత వస్తువుల కంటే ఇతర వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్న వస్తువులు త్వరగా పాడవుతాయి అని పక్కవారి వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 05:30 PM IST

చాలామంది సొంత వస్తువుల కంటే ఇతర వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్న వస్తువులు త్వరగా పాడవుతాయి అని పక్కవారి వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. శాస్త్రాలలో ఇప్పటికే ఇతరుల నుంచి ఎటువంటి వస్తువులు తీసుకోవాలి ఎటువంటి వస్తువులు తీసుకోకూడదు అన్న విషయాలను తెలిపారు. చాలా మంది ఎక్క‌డికైనా వెళ్లాల్సి వ‌చ్చిన్న‌ప్పుడు ఇత‌రు వ‌స్తువుల‌ను తీసుకుని బ‌య‌లుదేరుతారు. త‌ర్వ‌త ఇబ్బందులపాలు అవుతారు. కానీ ఆ విష‌యం వారికి అంత‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. మాములుగా పెద్ద‌లు ఇత‌రుల బ‌ట్ట‌లు, చెప్పులు వంటివి వాడుకోవ‌ద్ద‌ని, వారికి ఉన్న శ‌ని, దుర‌దృష్టం వంటివి మ‌న‌కు వ‌స్తాయ‌ని చెబుతుంటారు. చాలా మంది యువ‌త త‌మ ఫ్రెండ్స్ డ్రెస్సుల‌ను వాడుతుంటారు.

ఒకే రూంలో,ఒకే ఊరిలో ఉండేవారు ఈ విధంగా ఒకరి వస్తువులను మరొకరు వాడుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా ఫంక్షన్లకు బర్త్ డే పార్టీలకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్ షర్టు బాగుంది అంటే చాలు వాళ్లను అడిగి మరీ తీసుకుంటూ ఉంటారు. అలానే మన బట్టలనూ ఇతరులకు ఇవ్వొద్దు. అలా చేయడం వలన ప్రతికూల శక్తి మ‌న‌లోకి ఎంటర్ అవుతుంద‌ని తెలియ‌జేస్తోంది. ఇత‌రుల డ్రెస్సులు ధరించినట్లయితే అనుకున్న పని పూర్తి కాద‌ని, చేయాల్సిన పని పని మధ్యలోనే ఆగిపోతుందట. అలాగే మ‌నం చాలా మంది ద‌గ్గ‌ర నుంచి పెన్ తీసుకుని పొర‌పాటునో కావాలనో, లేదా మర్చిపోయో ఇవ్వ‌క‌పోవ‌డం చేస్తుంటారు.

ఇలా ఇత‌రుల పెన్ మ‌న ద‌గ్గ‌రే ఉంచేసుకోవ‌డం వ‌ల్ల కొంత అశుభం జ‌ర‌గ‌వ‌చ్చ‌ట. అలాగే చాలా మంది చేతి రుమాలు లేదా క‌ర్చీఫ్ ఇత‌రులు ఫ్రెండ్స్ నుంచి తీసుకుని వాడుతుంటారు. కొంత మంది రుమాలును గిఫ్ట్ లాగా తీసుకుంటారు. ఇలా చేయడం వ‌ల్ల మ‌న లైఫ్లో గొడ‌వ‌లు, బంధాలు విడిపోవ‌టం లాంటివి జ‌రుగుతాయట. అందుకే చేతిరుమాలు తీసుకోక‌పోవ‌డ‌మే మేలు.