Cash : పొరపాటున కూడా నగదు చెల్లించకుండా ఈ వస్తువులను అస్సలు తీసుకోకండి?

కొన్ని వస్తువులను డబ్బులు (Cash) ఇవ్వకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయట.

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 05:20 PM IST

Don’t take these Items at all without Paying Money : మామూలుగా మనం నిత్యం ఎన్నో రకాల వస్తువులు ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు అవి సడన్ గా అయిపోయినప్పుడు ఇరుగుపొరుగు వారిని అడిగి తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే అలా తీసుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల వస్తువులు మాత్రం ఫ్రీగా అసలు తీసుకోకూడదట. కొన్ని వస్తువులను డబ్బులు (Cash) ఇవ్వకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయట. మరి ఎటువంటి వస్తువులు డబ్బులు ఇవ్వకుండా తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

శాస్త్ర ప్రకారం డబ్బు (Cash) ఇవ్వకుండా ఎప్పుడు సూదిని తీసుకోకూడదు. సూది ఇనుప వస్తువు. దీనిని శనిగా భావిస్తారు.. కాబట్టి ఎప్పుడైనా సూదిని తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. అలాగే ఆ సూది ఇప్పించుకున్న వ్యక్తులు తీసుకున్న వ్యక్తుల మధ్య పరస్పర తగాదాలు విభేదాలు వస్తాయి. అలాగే పాలను కూడా ఎప్పుడూ కూడా దానధర్మంగా తీసుకోకూడదు ఇవ్వకూడదు. డబ్బులు చెల్లించకుండా పాలు తీసుకోవడం వల్ల ఇంట్లో అప్పుల భారం పెరుగుతుంది. అశాంత వాతావరణం కూడా నెలకొంటుంది. ఇనుప వస్తువులను ఎప్పుడూ కూడా ఇతరుల నుంచి బహుమతిగా లేదంటే ఉచితంగా అసలు తీసుకోకూడదు.

డబ్బులు చెల్లించకుండా ఇనుము తీసుకోవడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా మొదలవుతాయి.. ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అలాగే వాస్తు ప్రకారం నూనె దానంగా తీసుకోకూడదు ఇవ్వకూడదు. నూనె తీసుకున్నప్పుడు కాస్త డబ్బులు ఇవ్వడం మంచిది. అలా కాకుండా డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటే ఇంట్లో అశాంత వాతావరణం నెలకొంటుంది. పూజకు సంబంధించిన పూజ సామాగ్రిని కూడా ఎవరి నుంచి ఉచితంగా తీసుకోకూడదు. అలాంటి పూజా సామాగ్రితో దేవుడికి పూజ చేసిన కూడా ఆ ఫలితం దక్కదు.

Also Read:  Water Exercises: త్వరగా బరువు తగ్గాలంటే ఈ నీటి వ్యాయామాలు చేస్తే చాలు..!