Site icon HashtagU Telugu

Vastu Tips: పొరపాటున కూడా ఈ మొక్కలు ఇంట్లో ఉండకూడదు.. ఉంటే దరిద్రం పట్టినట్టే?

Bad Luck Plants

Bad Luck Plants

సాధారణంగా జంతు ప్రేమికులు, పక్షుల ప్రేమికులు ఏ విధంగా అయితే ఉంటారో అలాగే మొక్కల ప్రేమికులు కూడా ఉంటారు. మొక్కలను అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మొక్కల మీద ఉన్న ఇష్టంతో ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు తెలిసి తెలియక ఇంట్లో పెట్టకూడని మొక్కలను కూడా పెంచుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుందట. అటువంటి మొక్కలు వల్ల ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా ఆటంకాలు ఏదో విధంగా ఎదురవుతూనే ఉంటాయి. మరి ఇంట్లో ఎటువంటి మొక్కలను పెంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాక్టస్ లేదంటే అందుకు సంబంధిత మొక్కలను ఎప్పుడు కూడా ఇంట్లో పెంచుకోకూడదు. కాక్టస్ సంబంధిత మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దరిద్రం పట్టిపీడించడంతోపాటు అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. గులాబీ కూడా కాక్టస్ జాతికి చెందిన మొక్క తప్ప కాక్టస్ జాతికి చెందిన మొక్కల్ని అస్సలు ఇంట్లో పెంచుకోకూడదు. అదేవిధంగా బోన్సాయ్ మొక్కలను చాలా మంది తెలియక ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. వాటిని పెంచుకోవడం అసలు మంచిది కాదు. ఒకవేళ అటువంటి మొక్కలను పెట్టుకోవాలి అంటే కాలి స్థలంలో లేదా ఇంటి గార్డెన్లో పెట్టుకోవడం మంచిది.

అలాగే చాలా మంది చింత, గోరింటాకు చెత్తను పెంచుకుంటూ ఉంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. మీరు నివసించే ఇంటికి మరీ దగ్గర్లో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇళ్లల్లో చనిపోయిన మొక్కల పూల కుండీల్లో దర్శనం ఇస్తుంటాయి. వాటిని అలాగే ఇంట్లో పెట్టుకోవడం వల్ల దురదృష్టం పట్టిపీడుస్తుంది. అందుకే అలాంటి మొక్కల్ని వీలైనంత వరకు తీసిపారేయాలి. బాబుల్ చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు. వీలైనంత వరకు ఇలాంటి చెట్లను ఇంట్లో పెంచుకోకూడదు. కొందరు పూజ కోసం,అలాగే అవసరాల కోసం పత్తి పనికొస్తుందని పత్తి మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. పత్తితో పాటు సిల్కీ పత్తి మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది.

Exit mobile version