Puja Vastu Tips : పూజగదిలో ఈ నియమాలను నిర్లక్ష్యం చేయకండి, జీవితంలో పెద్ద కష్టాలు రావచ్చు

సనాతన ధర్మంలో దేవుడిని నిత్యం పూజించాలన్న నియమ నిబంధనలు ఉన్నాయి. భగవంతుడు నివసించని ఏ కణమూ ఈ ప్రపంచంలో ఉండదు. భగవంతుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సానుకూలత లభిస్తాయని నమ్ముతుంటారు.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 11:27 PM IST

Puja Vastu Tips: సనాతన ధర్మంలో దేవుడిని నిత్యం పూజించాలన్న నియమ నిబంధనలు ఉన్నాయి. భగవంతుడు నివసించని ఏ కణమూ ఈ ప్రపంచంలో ఉండదు. భగవంతుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సానుకూలత లభిస్తాయని నమ్ముతుంటారు. ప్రతి హిందువు తన ఇంట్లో దేవుడిని ఆరాధించడానికి ఒక పూజగదిని ఏర్పాటు చేసుకుంటారు. పూజాగదిలో ఇంట్లో సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. మనం పూజగదిలో, దీపారధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. కానీ మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. పూజగదిలో ఎలాంటి నియమాలు పాటించాలి… ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

పూజాగదిలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి. లేదంటే కష్టాలు ఎదుర్కొవల్సి వస్తుంది:

1. స్నానం చేయకుండా పూజగదిలోకి వెళ్లకూడదు. ఉదయం, సాయంత్రం పూజగదిలో దీపాలు వెలిగించాలి. గంట, శంఖము మోగించాలి.

2. హిందూమతంలో ఏ పూజచేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తారు. అందుకే పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఇది సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

3.పూజా స్థలంలో లక్ష్మీ దేవి విగ్రహానికి ఎడమ వైపున గణేశ విగ్రహాన్ని ఉంచాలి. వినాయకుడు కూర్చున్నట్లు ఉన్న విగ్రహాన్ని కానీ చిత్ర పటాన్ని కానీ పూజాగదిలో ఉంచాలి.

4. వాడిపోయిన, రోజుల తరబడి ఉంచిన పువ్వులను పూజకు ఉపయోగించకూడదు. ఇది ప్రతికూలతను తెస్తుంది.

5. మీ కుల దైవానికి సంబంధించిన చిత్రపటాలు తప్పనిసరిగా పూజాగదిలో ఉంచాలి. నిత్యం పూజలు చేయాలి. అంతే కాకుండా పూజగదిలో హనుమాన్ విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ప్రతి మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించాలి.

6. పూజగదిలో శివలింగాన్ని ఉంచినట్లయితే, శివలింగం పరిమాణం చిన్నగా ఉండాలని గుర్తుంచుకోండి.

7. పూజగదిలో మరణించినవారి చిత్రపటాలు ఉంచకూడదు. మీ పూర్వీకుల ఫోటోలు దక్షిణ దిశలో ఉంచడం మంచిది.

8. హిందూ గ్రంధాల ప్రకారం శనిదేవుడు, కాళీమాత, భైరవబాబా విగ్రహాలను పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదు.

9. ఈ దేవుళ్ల విగ్రహాలను ఇంట్లోని పూజగదిలో ఉంచినట్లయితే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.