Tusli Plant : తులసి మొక్కకు నీళ్లు పోసే విషయంలో ఆ 4 తప్పులు అస్సలు చేయకండి.. అవేటంటే?

తులసి మొక్కను (Tulsi Plant) పూజించడం మంచిదే కానీ తులసి మొక్క పూజించే విషయంలో కొన్ని రకాల నియమాలు తప్పనిసరి.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 06:40 PM IST

Tulsi Plant Tips : హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. హిందువుల ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి దేవిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకే తులసి దేనికి నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. తులసి మొక్కను (Tulsi Plant) పూజించడం మంచిదే కానీ తులసి మొక్క పూజించే విషయంలో కొన్ని రకాల నియమాలు తప్పనిసరి. అదేవిధంగా తులసి మొక్క విషయంలో కొన్ని రకాల తప్పులను అసలు చేయకూడదు.. అలా చేయడం వల్ల తులసి మొక్క ఆగ్రహానికి లోనవ్వక తప్పదు. ముఖ్యంగా తులసి మొక్కకు (Tulsi Plant) నీరు పోసేటప్పుడు నాలుగు రకాల తప్పులను అస్సలు చేయకూడదు అంటున్నారు పండితులు. మరి తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

తులసి మొక్కకు (Tulsi Plant) నీరు పోసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్నానం చేయకుండా నీరు అసలు పోయకూడదు. అలాగే భోజనం చేసిన తర్వాత నీరు సమర్పించకూడదు. ఈ తప్పులు చేయడం వల్ల మీరు విష్ణుమూర్తి ఆగ్రహానికి మాత్రమే కాకుండా లక్ష్మీ దేవి ఆగ్రహానికి కూడా గురవుతారు. లక్ష్మీనారాయ‌ణుల‌ కోపం కారణంగా, మీ ఇంట్లో కష్టాలు, పేదరికం వ్యాపిస్తాయి. దరిద్రం చుట్టుకుంటుంది. అదేవిధంగా తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు మీరు కుట్టిన వస్త్రాలను ధరించకూడదు. అంటే కుట్టని దుస్తులు వేసుకున్నాకే తులసి మొక్క‌కు నీళ్లు పోయాలి. కుట్టిన దుస్తులు ధరించి తులసి మొక్క‌కు నీరు పోయ‌డం వల్ల పూజ చేసిన ఫలితం ఉండదు.

అదేవిధంగా వారంలో రెండు రోజులు తులసి మొక్కకు అసలు నీరు పోయకూడదు. ఒకటి ఆదివారం రెండవది బుధవారం. ఈ రెండు రోజులు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. ఎందుకంటే ఈ రెండు రోజుల్లో తులసి దేవి విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి అటువంటి సమయంలో నీరు పోయడం వల్ల ఆమెను విశ్రాంతికి భంగం కలిగించినట్టు అవుతుంది. ఫలితంగా అమ్మవారి ఆగ్రహానికి గురవక తప్పదు. ఆదివారం, బుధవారం మాత్రమే కాకుండా ఏకాదశి రోజు కూడా తులసి మొక్కకు నీళ్లు సమర్పించకూడదు. ఎందుకంటే ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఆరోజు తులసీదేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. కాబట్టి ఆరోజున తులసి మొక్కకు నీరు పోయడం వల్ల ఆమె ఉపవాసానికి భంగం కలిగించినట్లు అవుతుంది. ఇది ఆమె కోపానికి కార‌ణం కావ‌చ్చు. తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆ నీరు నేలపై పడకుండా చూసుకోవాలి. తులసి మొక్క‌కు పోసే నీరు ఎప్పుడూ తుల‌సి కోట దాటి కింద పడకూడదు. అలాగే తులసి మొక్కకు ఎప్పుడూ కూడా సూర్యోదయం సమయంలో మాత్రమే నీరు సమర్పించాలి. సూర్యాస్తమయం సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు.

Also Read:  Smartphone: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సరిగా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండిలా?