Shiva Lingam: ఇంట్లో శివలింగం పెట్టుకుంటారా? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి!!

చాలామందికి తమతమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకొని అభిషేకం చేసుకోవాలనే కోరిక ఉంటుంది.

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 08:33 PM IST

చాలామందికి తమతమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకొని అభిషేకం చేసుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ప్రకారం.. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయొచ్చు. కానీ శాస్త్ర ప్రకారం నడుచుకోవడం తప్పనిసరి.నియమాలను పాటించడం అత్యవసరం.

నియమాలు..

* ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉండకూడదని  పండితులు చెబుతున్నారు.
* ఒకటి కంటే ఎక్కువగా శివలింగం
ఉండటం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయి. అనేక సమస్యలు వెంటాడుతుంటాయి.
* శివలింగం, సాలగ్రామం, చక్ర చిహ్నంతో ఉండే ద్వారకా శిల, సూర్యకాంతమణి వీటిని రెండు ఉంచి పూజించరాదు.
* ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజ చేసేవారు శివలింగాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టుకోవాలి.
* శివ లింగాన్ని  ఇంట్లో  పెట్టుకుని పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా జీవితం సుఖంగా సాగుతుంది.
* ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే అంగుష్టమాత్రం పరిమాణం ఉంటే సర్వ శ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించరాదు.
* పొరపాటున కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని పెట్టుకుని  పూజ చేయకూడదు.
* శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి. ప్రతిరోజూ శక్తికొద్దీ అర్చన నిర్వహించాలి. నియమనిష్ఠలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి.
* తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు.
* ఇంట్లో ఉంచిన శివలింగానికి ఎప్పుడూ పసుపు లేదా వెర్మిలియన్ సమర్పించవద్దు.
* శివునికి చందనాన్ని నిత్యం సమర్పిస్తారు. నిజానికి, వీటిని శివుడికి సమర్పిస్తే జీవితంలో కష్టాలను ఆహ్వానించడమే.
* శివలింగం బంగారం, వెండి, క్రిస్టల్ లేదా ఇత్తడితో ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ గాజు మొదలైన శివలింగాన్ని ఏర్పాటు చేయవద్దు.
* శివలింగాన్ని పూజించే సమయంలో తులసి ఆకులను ఎప్పుడూ సమర్పించవద్దు.
* శివుడికి బిల్వపత్రం, ఉమ్మెత్త మొదలైనవి మాత్రమే నైవేద్యంగా పెడతారు. శివునికి చంపా పువ్వును సమర్పించవద్దు.

రెండు శివలింగాలు ఉంటే..

ఒకవేళ ఇంట్లో రెండు శివలింగాలు ఉన్నట్లయితే, ప్రధాన లింగాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రెండోదానిని ఇంటి వెలుపల ఉండే తులసికోటలో ఉత్తరాభిముఖంగా పానవట్టాన్ని ఉంచి పూజించవచ్చు.

మట్టితో పార్థివ లింగం..

ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంది. కనుక ఇంకొందరు ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం అని సూచిస్తారు. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించడం మంచిది. ముఖ్యంగా శివునికి లింగార్చన చేసుకుంటే సర్వశుభం అనేది వాస్తవం. అయితే శుచి, శౌచం పాటించాలి. వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివ లింగం తయారుచేసుకుని శివుని అర్చించవచ్చు.