Ganesh: విగ్నేశ్వరుడిని పూజించేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే?

దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎక్కువ మంది కొలిచే దేవుళ్లలో విగ్నేశ్వరుడు కూడా ఒకరు. విగ్నేశ్వరుని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్త

Published By: HashtagU Telugu Desk
Ganesh

Ganesh

దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎక్కువ మంది కొలిచే దేవుళ్లలో విగ్నేశ్వరుడు కూడా ఒకరు. విగ్నేశ్వరుని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక వారంలో బుధవారం రోజున గణేశున్ని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. హిందూమతంలో ఏ శుభ కార్యమైనా గణేశ పూజతో ప్రారంభమవుతుంది. బుధవారాలలో గణపతిని మనస్పూర్తిగా పూజించడం వలన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు భక్తులకు సకల బాధలు తొలగిపోతాయి.

విఘ్నేశ్వరుడికి పూజించేటప్పుడు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. వీటివల్ల ఆయనకు కోపం వస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఆయనకు కోపం తెప్పించిన వారవుతారు. మరి విఘ్నేశ్వరుని పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఇలాంటి వస్తువులను సమర్పించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గణేశ పూజలో తెల్లటి చందనం, తెల్లని వస్త్రం, తెల్లటి పవిత్ర దారం మొదలైన వాటిని సమర్పించరు. ఎరుపు లేదా పసుపు చందనం సమర్పించవచ్చు. తులసిని విష్ణువుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు.

గణేశ పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు. తులసి వివాహ ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన తులసి గణేశుడికి ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు చేస్తానని శపించింది. ఆ తర్వాత గణేశుడు తులసిని నువ్వు అసురుడిని పెళ్లి చేసుకుంటావు అని శపించాడు. దీని తరువాత, గణపతి పూజలో తులసిని సమర్పించడం నిషిద్ధంగా పరిగణించారు. అలాగే తెల్లటి పూలు కేతకి పుష్పాలు విఘ్నేశ్వరుడికి సమర్పించకూడదు. అలాగే ఎండిన పువ్వులు సమర్పించడం కూడా అశుభం. గణేశ పూజలో పొడి, పాత పువ్వులను సమర్పించవద్దు. ఎండిన పువ్వులను ఉపయోగించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో పేదరికం పెరుగుతుంది. అయితే గణేశునికి పూజ చేసేటప్పుడు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు దుర్వేని సమర్పించాలి. అలాగే పచ్చి పసుపు, లడ్డూలు, మోదకాలు, పసుపు పూలు, వస్త్రాలు సమర్పించాలి.

  Last Updated: 24 Jun 2024, 07:58 PM IST