Chanakya niti : పిల్లల ముందు ఇలాంటి తప్పులు చేయకండి.!!

  • Written By:
  • Updated On - November 26, 2022 / 05:35 PM IST

ఆచార్య చాణక్యుడి సూత్రాలను పాటించినట్లయితే..జీవితం అద్భుతంగా ఉంటుంది. అద్బుతమైన జీవిత విలువలు, ఆచార్య చాణక్యుడి సందేశంలో క్లుప్తంగా ఉన్నాయి. ఆయన సందేశాలు జీవితానికి వెలుగులు అందిస్తాయి. అదేవిధంగా ఆచార్య చాణక్యుడు కూడా తల్లిదండ్రులకు కొంత సందేశాన్ని ఇచ్చారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలాంటి తప్పులు చేయకూడదు. అవి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. అవేంటో చూద్దాం.

అసభ్య పదజాలం వాడకూడదు..ప్రేమతో మాట్లాడాలి.
పిల్లలను దేవుడితో సమానంగా పోలుస్తుంటారు. పిల్లల మనస్సు కూడా వెన్నలాంటిది. అందుకే పిల్లలతో ప్రేమగా గా వ్యవహరించాలి. వారిని ప్రేమగా ప్రేమగా పెంచాలి. ఐదేళ్లలోపు పిల్లలు ప్రతి విషయాన్ని ఎంతో ప్రేమగా చెబితే అర్థం చేసుకుంటారు. పిల్లలు ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేయరు. తెలిసి తెలియని వయస్సు కాబట్టి వారు చేసే పొరాపాటులను మనం సరిచేస్తుండాలి. ప్రేమగా వారికి అర్థం అయ్యే విధంగా చెప్పాలి. పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులు. మనం ఏం చేస్తే వారు మనల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు.

మీ పిల్లలు మర్యాదపూర్వకంగా ఉండాలనుకుంటే…మొదట మీరు చేయాల్సింది వారి భాషను మెరుగుపరచడం. ఇందులోకం వారి ముందు మనం మాట్లాడే భాష సరిగ్గా ఉండాలి. రోజువారి జీవితంలో కూడా ఏ కారణం చేతనైనా అసభ్య పదజాలం ఉపయోగించకూడదు. ముఖ్యంగా పిల్లల ముందు ఇలాంటి పదాలు వాడినట్లయితే వారిపై ఎంతో ప్రభావం చూపుతుంది. పెద్దలు మాట్లాడే ప్రతి మాటను పిల్లలను స్వీకరిస్తారు. కాబట్టి పిల్లల ముందు ఎప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడేందుకు ప్రయత్నించండి.

తప్పులు చేస్తే ప్రేమగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
ఐదేళ్ల పిల్లలు కొద్ది కొద్దిగా విషయాలను అర్థ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ వయస్సులో తప్పు చేస్తే తిట్టవచ్చు. కానీ ప్రేమగా చెప్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఒకరి తప్పులు మరొక్కరు ఎత్తిచూపకూడదు. ఇది పిల్లలకు చికాకు కలిగిస్తుంది. ఎందుకంటే మీరు చేస్తే వాళ్లు అదే పాటిస్తుంటారు.

గౌరవంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
తల్లిదండ్రులు ఒకరి పట్ల ఒకరు గౌరవంగా, సమానంగా ప్రేమగా ఉండటం కూడా చాలా ముఖ్యం. దీనివల్ల ఒకరినొకరు గౌరవించడం నేర్చుకుంటారు. కుటుంబ సభ్యులంతా ప్రేమతో ఉంటే పిల్లలు కూడా అదేవిధంగా ఉంటారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కించపరిచేలా పదాలు లేదా దూషించే పదాలు మాట్లాడకూడదు. ఇది భవిష్యత్తులో మీకు, పిల్లలకు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.

అబద్ధాలు చెప్పకూడదు
అబద్ధం ఎప్పుడు కూడా శత్రువు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. ప్రేమతో నేర్పించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల ముందు అబద్ధాలు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల చిన్నారులు కూడా అదే అలవాటు పడే ప్రమాదం ఉంది. అందువల్ల, పిల్లలతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

గొడవలు
భార్యభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సాధారణమే. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, విసుగు పుట్టాయి. పిల్లల ముందు ఎప్పుడూ గొడవపడకూడదు. ఈ పరస్పర ప్రేమ బంధం ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. మీరు పిల్లల ముందు గొడవపడినట్లయితే, మీరు వారి దృష్టిలో గౌరవాన్ని కోల్పోతారు.

స్నేహితుల్లా చూడాలి.
మీ పిల్లలు 10 నుండి 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు వారు చాలా విషయాలను అర్థం చేసుకుంటారు. మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా, ఎంత కోపంగా ఉన్నా హద్దులు ముఖ్యం. కోపంతో కాకుండా ప్రేమతో, ప్రతి విషయాన్ని వివరించడానికి ప్రయత్నించడం మంచిది. మీరు ఎంత మితంగా ఉంటే అంత మంచిది. పిల్లలకు 16 ఏళ్లు వచ్చినప్పుడు వారిని స్నేహితుల్లా చూసుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. స్నేహితుడిగా, పిల్లల ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.