God Idol: ఈ విగ్రహాలను పూజాగదిలో ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా?

హిందువులు పూజ గదిలో ఎంతోమంది దేవుళ్ళ ఫోటోలు అలాగే విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. హిందువుల ఇళ్లలో

  • Written By:
  • Publish Date - February 8, 2023 / 06:00 AM IST

హిందువులు పూజ గదిలో ఎంతోమంది దేవుళ్ళ ఫోటోలు అలాగే విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. హిందువుల ఇళ్లలో దాదాపుగా పూజ గదిలో విగ్రహాలు ఫోటోలు లేని ఇళ్ళు ఉండదని చెప్పవచ్చు. అయితే చాలామంది పూజ గదిలో ఇష్టమైన దేవుడు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అది మంచిదే కానీ చాలామంది విగ్రహాలను కొనుగోలు చేసినప్పుడు కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు. అలా చేసే పొరపాట్ల వల్ల ఆర్థిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. అలాగే దేవుడి విగ్రహాన్ని పూజించే ముందు ఏ విగ్రహాన్ని పూజించాలి, దేనిని పూజించకూడదు అనేది తెలుసుకోవాలి.

అప్పుడే మన జీవితానికి పూజా ఫలం లభిస్తుందని అంటారు. ఎప్పుడూ కూడా పూజ గదిలో ఇనుము, అల్యూమినియం, ఉక్కు విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకూడదు. వీటిని దేవుడి ఇంట్లో ఉంచడం అశుభ సంకేతం. అటువంటి విగ్రహాలను పూజించడం వల్ల ఇంట్లో అనేక రకాల సమస్యలు తెలుస్తాయి. విగ్రహానికి లోహం మాత్రమే కాదు ఎత్తు కూడా ముఖ్యం. 9 అడుగుల ఎత్తులో ఉన్న దేవుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఇంట్లో చిన్న విగ్రహం ఉంటే ఎంతో మంచిది. అలాగే ఇంట్లో పూజ గదిలో పిన్ని విగ్రహాలను పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఇంట్లో వెండి విగ్రహంతో పాటుగా రాగి ఇత్తడి విగ్రహాలను కూడా పెట్టి పూజించవచ్చు.

అలాగే దేవుడి గదిలో వెండి విగ్రహాలతో పాటుగా బంగారు విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలను లభిస్తాయి. అయితే చాలావరకు బంగారు విగ్రహాలు పూజించడం అన్నది తక్కువగా ఉంటుంది. అయితే చాలా వరకు మనం ఇంట్లో ఎక్కువగా ఇత్తడి రాగి వెండి విగ్రహాలను మాత్రమే పూజించడం చూస్తూ ఉంటాం. బంగారు విగ్రహాలు అన్నవి ఎవరో ధనవంతులు మాత్రమే పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే విగ్రహాలను పెట్టుకోవడం మాత్రమే కాదండి వాటికి క్రమం తప్పకుండా పూజ చేస్తూ ఉండాలి.