Site icon HashtagU Telugu

Money Plant: మనీ ప్లాంట్ ను ఈ మూల పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

Mixcollage 05 Jul 2024 06 23 Pm 4065

Mixcollage 05 Jul 2024 06 23 Pm 4065

మామూలుగా మనం ఇంట్లో బయట, ఆఫీసులలో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అలా ఎక్కువ శాతం మంది మనీ ప్లాంట్ ని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అని, ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు తలెత్తని చాలామంది భావిస్తారు. మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం మంచిదే కానీ ఈ మొక్క విషయంలో కొన్ని రకాల విషయాలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా మంచి దిశలో పెట్టడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఆ వివరాల్లోకి వెళితే.. మనీ ప్లాంట్ మొక్కను తూర్పు లేదా పడమర దిశలో ఉంచకూడదు. ఇలా ఈ దిశలో ఉంచటం వల్ల ఇది సమస్యలను తీసుకువస్తుందట. మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది. మనీ ప్లాంట్ మొక్క ఈ దిశల్లో ఉండకుండా చూసుకోండి. ఈశాన్య మూలలో పెంచుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ మొక్క దగ్గరలో ఎరుపు రంగులో ఉండే వస్తువులను ఉంచరాదు. ఇలా చేస్తే ఇది ఇంటికి అశుభం మీకు దురదృష్టాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ మీరు ఇంటి వంట గదిలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకున్న దాని పక్కన ఎరుపు రంగులో ఉండే వస్తువులు పెట్టకూడదు.

అలాగే మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే దాని చుట్టూ ఉండే ప్రదేశం కాస్త విలాసవంతంగా ఉండేలా చూసువాలి. ఇరుకుగా ఉండకూడదు. మీరు ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్కను కొనుగోలు చేసినప్పుడు వాటి ఆకులు హార్ట్ షేప్ లో ఉండేవి చూసి కొనుగోలు చేయండి ఇవి మనకు మన ఇంటికి సుఖశాంతులను తీసుకువస్తాయి.