Friday: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం తప్పకుండా ఈ పనులు చేయాల్సిందే?

మామూలుగా మనం లక్ష్మీ అనుగ్రహం కోసం రకరకాల పూజలు పరిహారాలు దానధర్మాలు చేస్తూ ఉంటాం. ఇంకొందరు వాస్తు ప్రకారంగా కూడా అనేక రకాల చిట్కాలను పాటిస్

  • Written By:
  • Publish Date - February 4, 2024 / 09:30 AM IST

మామూలుగా మనం లక్ష్మీ అనుగ్రహం కోసం రకరకాల పూజలు పరిహారాలు దానధర్మాలు చేస్తూ ఉంటాం. ఇంకొందరు వాస్తు ప్రకారంగా కూడా అనేక రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే అటువంటివి పాటించడంతోపాటుగా శుక్రవారం తప్పకుండా కొన్ని రకాల పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. మరి శుక్రవారం రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా శాస్త్రం ప్రకారం తెల్లటి వస్తువులను శుక్రవారం దానం చేయకూడదు. సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవితో ముడిపడి ఉన్న రోజు శుక్రవారం. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే పేదరికం మీ ఇంట్లోకి రాదు. ఈ తప్పులు చేయకుండా ఉన్నప్పుడే పూజతో పాటు పునస్కార పుణ్యం కూడా లభిస్తుంది.

శుక్రుడు జీవితంలో శ్రేయస్సును, ఆనందాన్ని తెస్తాడు. శుక్రవారం రోజు పంచదారను దానం ఇవ్వకూడదు. అలా చేస్తే జీవితంలో ఆనందాన్ని తగ్గిస్తుంది. గ్రహాల కదలికల ఆధారంగా దానధర్మాలు చేస్తుండాలి. వ్యాపారస్తులు శుక్రవారం మాత్రం చక్కెర దానమివ్వకూడదు. అంతేకాదు తెల్లటి రంగు ఉన్న పదార్థాలను ఆరోజు దానం చేయకూడదు. శుక్రవారం ఉదయం, సాయంత్రం రెండుపూటలా అమ్మవారిని పూజించాలి. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఈ కారణంతో ఇంటిని శుభ్రంగా ఉంచాలి. అలాగే ఆరోజు మద్యం తీసుకోకూడదు. మాంసం తినకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. నోటినుంచి ఎటువంటి పరుష పదాలు రాకూడదు. చెడ్డ మాటలు రాకుండా చూడాలి.

ఎవరితోను వివాదాలు పెట్టుకోవద్దు. శుక్రవారం పూట మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. చెడు మాటలు పలికేవారిని లక్ష్మీదేవి కోపగించుకుంటుంది. పరుషంగా మాట్లాడేవారెవరూ ఆమె అనుగ్రహాన్ని పొందలేదు. శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే అది రుణదాత, రుణగ్రహీత ఇద్దరిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అప్పు ఇస్తే లక్ష్మీదేవిని వేరొకరి ఇంటికి పంపుతున్నట్లుగా అర్థం వస్తుంది. అప్పు తీసుకుంటే వేరొకరి ఇంటి లక్ష్మిని తీసుకున్నారని అర్థం వస్తుంది. వచ్చే ఇంటికీ మేలుచేయదు.. వెళ్లే ఇంటికీ మేలు చేయదు. ఇద్దరికీ సమస్యలు ఎదురవుతాయి.