Bride: పెళ్ళైన నవ వధువుని అత్తారింటికి పంపేటప్పుడు ఇవి ఇస్తున్నారా.. అయితే జాగ్రత్త!

మామూలుగా ఆడపిల్లగా జన్మించిన ప్రతి ఒక్క మహిళా స్త్రీలు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి వెళ్లడం అన్నది సహజం. ఇది ఎప్పటి నుంచో వస్తుంది

  • Written By:
  • Updated On - February 22, 2024 / 07:47 PM IST

మామూలుగా ఆడపిల్లగా జన్మించిన ప్రతి ఒక్క మహిళా స్త్రీలు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి వెళ్లడం అన్నది సహజం. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. అయితే పెళ్లి అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన కల. పెళ్లి తర్వాత ఆడపిల్లలు ఒక్కసారిగా అప్పటివరకు ఉన్న ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతారు. మరి అలా వెళ్లేటప్పుడు పెళ్లయిన తర్వాత నవవధువుకి తల్లిదండ్రులు ప్రేమతో ఎన్నో రకాల కానుకలు ఇచ్చి పంపుతూ ఉంటారు. అత్తారింట్లో కూతురు సుఖంగా ఉండాలని కష్టాలు పడకూడదని తల్లిదండ్రులు భావించడంతోపాటు ప్రేమగా కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే నవ వధువు అత్తారింటికి వెళ్లేటప్పుడు కొన్ని రకాల వస్తువులు ఇవ్వడం అస్సలు మంచిది కాదు అంటున్నారు పండితులు.

ఇంతకీ అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లలకు ఇచ్చి పంపకూడని వస్తువులు ఏమిటి? అన్న విషయానికి వస్తే.. తల్లిదండ్రులు కుమార్తె జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల దేనికి లోటు లేకుండా ఉండాలని అనేక బహుమతులను కూడా ఇచ్చి పంపుతారు. అయితే ముఖ్యంగా నాలుగు వస్తువులను ఆడపిల్లకు ఇచ్చి పంపితే అరిష్టమని, దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయట. ఆ వస్తువులలో ముఖ్యమైనది ఊరగాయ పచ్చడి. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తున్న ఆడపిల్ల తల్లి ఇంట్లో చేసిన ఊరగాయ పచ్చళ్ళు తీసుకువెళ్లకూడదు. కారంతో తయారు చేసిన ఊరగాయ పచ్చళ్ళు తీసుకువెళ్తే అత్తవారింట్లో బంధాలు కూడా అలాగే కారంగా ఉంటాయని చాలామంది బలంగా నమ్ముతారు.

కనుక పొరపాటున కూడా ఊరగాయ పచ్చళ్ళు ఇచ్చి పంపకూడదు. ఒకవేళ ఊరగాయ పచ్చడి కూతురికి ఇవ్వాలి అనుకుంటే పెళ్లి తర్వాత ఆమె ఇంటికి వెళ్లి, మార్కెట్ నుండి పదార్థాలు తెచ్చుకొని అక్కడే సిద్ధం చేసి ఇచ్చి వస్తే మంచిది.అలాగే అత్తవారింటికి వెళ్లే కూతురికి చీపురుని కూడా పొరపాటున కూడా ఇచ్చి పంపకూడదు. లక్ష్మీదేవి స్వయంగా చీపురులో నివసిస్తుందని చెబుతారు. అటువంటి చీపురును ఇచ్చి పంపిస్తే ఆడపిల్ల వారి కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండదని, వారు అనేక కష్టాలు పడాల్సి వస్తుందట. కుమార్తెకు చీపురును ఇచ్చి పంపిస్తే వాళ్ల ఇంట్లో పరిస్థితులు దుఃఖదాయకంగా మారుతాయి. సూది, జల్లెడ.. అత్తవారింటికి వెళ్లే కూతురికి ఎప్పుడు సూదిని ఇచ్చి పంపకూడదు. సూది జీవితంలో తీపికి బదులు చేదును తెస్తుంది. అది భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా కారణం అవుతుంది. ఇక అత్తవారింటికి వెళ్లే కూతురికి పొరపాటున కూడా జల్లెడ ఇవ్వకూడదని, జల్లెడ ఇచ్చి పంపితే వారి జీవితంలో సంతోషం జల్లెడ పట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ నాలుగు వస్తువులు ఇచ్చి పంపితే అరిష్టమని, కూతురు సంతోషంగా ఉండాలి అని, తాము కూడా సుఖంగా, సంతోషంగా జీవించాలని భావించే వారు ఎవరూ ఈ వస్తువులుఇవ్వకూడదని చెబుతున్నారు పండితులు.