Shani Dev: శనివారం ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.. తింటే శని పట్టడం ఖాయం..?

పురాణాల ప్రకారం గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరి దేవుళ్ళ మాదిరిగానే శని దేవుడిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 09:13 AM IST

పురాణాల ప్రకారం గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరి దేవుళ్ళ మాదిరిగానే శని దేవుడిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అయితే శని దేవుడు మనం చేసే కర్మలకు సరైన ఫలితాన్ని అందిస్తుంటారు. మనం ఎలాంటి కర్మలు చేసి ఉంటామో అందుకు తగ్గ ఫలితాన్ని శని దేవుడు మనపై చూపించడం వల్ల శని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా శని కోపానికి గురికాకుండా ఉండాలంటే శనివారం కొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టడం వల్ల శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.

శనీశ్వరుని ఆగ్రహం మనపై ఉండకుండా శని ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే శనివారం పొరపాటున కూడా మామిడికాయ తినకూడదు.చాలామంది పచ్చడి లేనిదే అన్నం తినరు కాకపోతే శనివారం మామిడికాయ తినడం శనీశ్వరునికి వ్యతిరేకం. అదేవిధంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ శనివారం పాలు పెరుగు వంటి పదార్థాలను ఏమాత్రం ముట్టుకోకూడదు. అదేవిధంగా ఎర్ర కందిపప్పు తినడం వల్ల శని ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. అందుకే శనివారం ఎర్ర కందిపప్పు పూర్తిగా దూరంగా ఉంచాలి.

ఇక ఎండు మిరపకాయలను సైతం శనివారం తినకూడదు. ఎండు మిరపకాయలు మిరపపొడితో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటితోపాటు ఆవనూనె, నల్లటి నువ్వులు, ఆల్కహాల్, వంటి వాటిని దూరంగా పెట్టడం వల్ల శని దేవుడి ఆగ్రహానికి గురికాకుండా ఉంటారు.అయితే శనీశ్వరునికి సంతోషం కలిగించే పనులు చేయటం వల్ల ఆయన దీవెనలు ఎల్లప్పుడూ మనపై ఉండి జీవితంలో ఎంతో సంతోషంగా ఉండొచ్చు అయితే ఆయన ఆగ్రహానికి గురైతే మాత్రం శని ప్రభావం నుంచి బయటపడటం ఎంతో కష్టమైన పని.