హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో సంక్రాంతి పండుగ కూడా ఒకటి. ఏడాది ఆరంభంలో జరుపుకునే తొలి పండుగ ఈ సంక్రాంతి పండుగ. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుకున్న ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పిండి వంటలు కొత్త అల్లుళ్ళు కొత్త ధాన్యం, కోళ్ల పందేలు గాలిపటాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మకర సంక్రాంతి తర్వాత ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. పుష్య మాసం తర్వాత శుభ కార్యాలు కూడా ప్రారంభమవుతాయి. అయితే మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.
ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. ఇకపోతే ఈ ఏడాది జనవరి 14వ తేదీ మంగళవారం రోజున మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజున సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశి లోకి ఉదయం 9.03 గంటలకు ప్రవేశించనున్నాడు. ఇక ఈ మకర రాశి రోజు ఏం చేయకూడదు అన్న విషయానికి వస్తే.. మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా పొరపాటున కూడా ఆహారం తీసుకోకూడదట. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అపరిశుభ్రంగా మారి విషపూరితంగా మారుతుందని చెబుతున్నారు. మకర సంక్రాంతి రోజున స్నానానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ రోజు పొరపాటున కూడా నూనె దానం చేయకూడదట.
మకర సంక్రాంతి రోజున నూనె దానం చేయడం అశుభం. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలు, ప్రతి కూలతలు ఇంట్లోకి వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు మకర సంక్రాంతి రోజున తెల్ల బియ్యం, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను దానం చేయకూడదట. అలాగే మకర సంక్రాంతి రోజున తామసిక ఆహారం లేదా మద్యపానానికి దూరంగా ఉండాలట. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రతికూలత వస్తుందని, ఆరోగ్యం పై కూడా చెడు ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మకర సంక్రాంతి రోజున ఇంటి వచ్చిన పేదలకు, బ్రహ్మనులకు ఆకలి అన్నవారికి ఏదైనా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళనివ్వకూడదట. అంతేకాదు ఎవరిని పొరపాటున కూడా అవమానించ కూడదని, ఈ విధంగా చేసిన వారు పాపానికి పాల్పడినట్లే అంటున్నారు.