Site icon HashtagU Telugu

Amavasya: పొరపాటున కూడా అమావాస్య రోజు ఇలా అస్సలు చేయకండి.. చేశారు దరిద్రం చుట్టుకోవడం ఖాయం?

Mixcollage 30 Jun 2024 07 26 Pm 1259

Mixcollage 30 Jun 2024 07 26 Pm 1259

అమావాస్య చాలా శక్తివంతమైన. అందుకే ఈరోజు చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు కూడా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతూ ఉంటారు. అయితే అమావాస్య రోజు చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనకు తెలుసుకుందాం.. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది.

కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. తల స్నానం చేయడం మంచిది. అమావాస్య రోజు తల స్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు. తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించరాదు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్రహేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం.

అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలాలి. అలాగే స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలి పెట్టాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం లాంటివి అస్సలు చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం 5-6 గంటల సమయంలో తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర ప్రకారము ఈ రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు.
అలాగే జరుగుతున్న పనులను ఎట్టి పరిస్థితులలో ఆపరాదు. అలాగే పసిపిల్లలను అమావాస్య రోజున సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. ఈ రకమైన పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

Exit mobile version