Amavasya: పొరపాటున కూడా అమావాస్య రోజు ఈ తప్పులు అస్సలు చేయకండి?

వాస్తు శాస్త్ర ప్రకారం అమావాస్య, పౌర్ణమి సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు. అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది. ఈరోజు

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 10:30 PM IST

వాస్తు శాస్త్ర ప్రకారం అమావాస్య, పౌర్ణమి సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు. అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది. ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము. అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీడిస్తుంది. మరి అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది. అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభఫలితాలను పొందగలుగుతారు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక తల స్నానం చేయడం మంచిది. అమావాస్య రోజు తల స్నానం చేయవచ్చు కానీ తలంటుకోరాదు. తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించకూడదు.

అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రించకపోవడమే మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్రహేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలడం మంచిది. శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలి పెట్టాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది.

అలాగే అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం 5-6 గంటల సమయంలో తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. కాబట్టి ఆ రోజున తప్పకుండా లక్ష్మి పూజ చేయడం మంచిది. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర ప్రకారము ఈ రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు.