2025 జనవరి 9,10 తేదీలలో వైకుంఠ ఏకాదశి వచ్చింది. రెండు తేదీలలో ఏ రోజున స్వామి వారిని దర్శించుకోవాలి అంటే 10వ తేదీన దర్శించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శ్రీమహావిష్ణువు వైకుంఠం వదిలేయ్ భూలోకానికి వస్తాడని నమ్మకం. అలాగే ఈ రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్లి శ్రీమహావిష్ణువుని దర్శించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ రోజున భక్తులు లేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం ఉండాలి అనుకున్న వారు ఉండవచ్చు.
ఉపవాసం ఉండాలి అనుకున్న వారు తొమ్మిదవ తేదీ నుంచి ఉపవాసం ఉండి 11వ తేదీ ఆ ఉపవాసాన్ని విరమించాలని చెబుతున్నారు. ఇక ఈరోజు చేపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్డు మద్యపానియాలు వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు. ఉపవాసం ఉన్నవారు అసలు తినకూడదట. అలాగే ధాన్యాలు బీన్స్ వంటివి కూడా తినకుండా ఉండాలని చెబుతున్నారు. ఉపవాసం ఉన్నవారు పండ్లు పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఏకాదశి రోజున భక్తులు తులసి ఆకులు తీయడం నిషేధం. భక్తులు ఏకాదశి ఉపవాసం రోజున కాకుండా తష్మి తిథి రోజున తల స్నానం చేయాలని సూచించారు. భక్తులు ఏకాదశి ఉపవాసం రోజున శ్రీమద్ భాగవతం లేదా శ్రీమద్ భగవద్గీత పఠించాలి. విష్ణు మంత్రాలను పఠించాలి. ఉపవాస సమయంలో భక్తులు నిద్రించడం, ఇతరులను తిట్టడం, అబద్ధాలు చెప్పడం లాంటివి అసలు చేయకూడదట. దువాదశి తిథి నాడు నిర్దేశిత ప్రాణ సమయంలో ఉపవాసం పూర్తి చేయాలని చెబుతున్నారు.