Site icon HashtagU Telugu

Tuesday: పొరపాటున కూడా మంగళవారం రోజు ఈ తప్పులు అస్సలు చేయకండి!

Tuesday

Tuesday

హిందూ మతంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఆ రోజున ఆ దేవుళ్లను ప్రత్యేకంగా పూజించడంతో పాటుగా పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతుంటారు. ఆ విధంగా హనుమంతుడికి మంగళవారం రోజు అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని చెబుతున్నారు పండితులు. మంగళవారు నాడు కొన్ని రకాల పనులను చేస్తే జీవితంలో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు అంటున్నారు.

మరి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు. ఇక చేయకూడని విషయాలకు వస్తే.. పొరపాటున కూడా మంగళవారం రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం లాంటి పనులను అస్సలు చేయకూడదని, ఇలాంటివి చేస్తే హనుమంతుడివి కోపం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది శుభప్రదంగా పరిగణించబడదట. దీని వల్ల మీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. అందుకే మంగళవారం నాడు జుట్టును, గోర్లును కట్ చేయడం, షేవింగ్ చేయడం లాంటివి అసలు చేయకూడదని చెబుతున్నారు.

అదేవిధంగా మంగళవారం రోజు ఆల్కహాల్ ని తాగకూడదట. మందు కూడా సేవించకూడదని చెబుతున్నారు. ఈ రోజున ఈ రెండింటికి వీలైనంతవరకు దూరంగా ఉండడం మంచిదట. మంగళవారం రోజు మద్యం మాంసం ముట్టుకుంటే హనుమంతుని ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రతి మంగళవారం హనుమంతుని కోసం ఉపవాసం ఉంటున్నట్టైతే ఈ సమయంలో మీరు ఉప్పును తినకూడదట. ఒకవేళ ఉప్పును తీసుకుంటే మీరు ఉపవాసం ఫలితాన్ని పొందలేరట. ఉప్పు తినడం వల్ల అది మీ ఉపవాసాన్ని భంగం చేస్తుందట అందుకే ఉపవాసం ఉండేవారు ఉప్పుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే పొరపాటున కూడా మంగళవారం రోజు అప్పులు అస్సలు ఇవ్వకూడదని చెబుతున్నారు. మంగళవారం రోజు అప్పు ఇస్తే తిరిగి రుణాన్ని పొందడం చాలా కష్టమవుతుందట. మంగళవారం రోజు ఎక్కడికి దూర ప్రయాణాలు చేయకూడదని ఒకవేళ చేయాల్సి వస్తే నోట్లో బెల్లం ముక్క వేసుకొని తిన్న తర్వాతే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని చెబుతున్నారు.