Friday: శుక్రవారం పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి?

చాలామంది శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. కానీ నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు క

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 05:54 PM IST

చాలామంది శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. కానీ నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది తెలిసి తెలియక శుక్రవారం రోజున కొన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పనులు చేయకూడదు. మరి శుక్రవారం రోజున ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫొటోను కానీ దేవుడి మందిరంలోంచి బయటకు తీయరాదు. కొంతమంది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు. పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయరాదు. కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది గురువారం రోజున తీయకూడదు. అలాగే శుక్రవారం రోజు ఎప్పుడు కూడా అప్పు తీసుకోకూడదు ఇవ్వకూడదు. అయితే ఎవరికైనా సహాయం అవసరం అయితే చేయండి కానీ రుణం రూపంలో ఇచ్చి పుచ్చుకోవడాలు లాంటివి చేయకూడదు. శుక్రవారం రోజు కొంతమంది వైభవ లక్ష్మీ ఉపవాసం పాటిస్తారు.

ఈ రోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అందుకే పొరపాటున కూడా అమ్మాయిలపై కోప్పడవద్దు ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలుంటే వారిని తిట్టడం, కొట్టడం లాంటివి చేయరాదు. ఈ రోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవ్వరికీ ఇవ్వకండి. విగ్రహాన్ని ఇంటికి తీసుకురావొచ్చు కానీ తీసుకెళ్లి ఇవ్వొద్దు. పొరపాటున కూడా అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు.. అలాగే శుక్రవారం రోజున బూజు దులపడం అస్సలు చేయకూడదు. మగవారు, ఆడవారు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదు. ఈ రోజున మాసినబట్టలు ధరించకూడదు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం, ఇతరులకు ఇవ్వడం లాంటివి చేయకూడదు..