Tuesday: వారంలో కొన్ని రోజుల్లో కొన్ని రకాల పనులు చేయడం నిషేధించబడింది. అందులో ముఖ్యంగా మంగళవారం రోజున కొన్ని రకాల పనులు చేయడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు. మరి మంగళవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మంగళవారం చేయకూడని పనులలో గోర్లు కత్తిరించడం అలాగే జుట్టు కత్తిరించడం కూడా ఒకటి. ఇలా చేయడం అస్సలు మంచిది కాదట.
అదేవిధంగా మంగళవారం రోజు ఎవరికి అప్పుడు ఇవ్వకూడదని ఎందుకంటే ఈరోజు అప్పు ఇస్తే తిరిగి మళ్ళీ రాబట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అప్పు తీసుకున్న కూడా ఆ డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోయి మళ్లీ తీర్చలేని పరిస్థితి రావచ్చు అని చెబుతున్నారు. ఎప్పుడు కూడా మంగళవారం రోజున కొత్త దుస్తులు దరించకూడదని చెబుతున్నారు. ఒకవేళ మీరు ధరించాలి అనుకుంటే తప్పకుండా మీరు ఆ కొత్త బట్టలను ఒకసారి ఉతికి వేసుకోవడం లేదంటే గోమాత మీద వేసి మళ్లీ వేసుకోవడం లాంటివి చేయాలట.
అలాగే మంగళవారం రోజు ఎంతో అవసరం అయితే తప్ప ప్రయాణాలు వేసుకోకూడదని చెబుతున్నారు. మీరు మంగళవారం రోజున ఉపవాసం ఉండాలి అనుకుంటే ఆ రోజు రాత్రి ఉప్పు వేసిన ఆహార పదార్థాలు అసలు తీసుకోకూడదు. మంగళవారం తలంటూ స్నానం చేయకపోవడమే మంచిది అని చెబుతున్నారు. ఒకవేళ ఈరోజున మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అనుకుంటే విద్యా వైద్య దైవాదీ కార్యక్రమాలకు నిర్మొహమాటంగా ఇవ్వవచ్చని చెబుతున్నారు.
Tuesday: మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో అంతే సంగతులు!

Tuesday