Tulasi Plant: ఎండిపోయిన తులసి మొక్క విషయంలో అలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి?

హిందువుల ఇండ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అన్నది తప్పనిసరిగా ఉంటుంది. పూర్వకాలం నుంచి తులసి మొక్కను హిందువులు పూజిస్తూనే ఉన్నారు

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 07:38 PM IST

హిందువుల ఇండ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అన్నది తప్పనిసరిగా ఉంటుంది. పూర్వకాలం నుంచి తులసి మొక్కను హిందువులు పూజిస్తూనే ఉన్నారు. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అయితే చాలామంది తెలిసి తెలియక తులసి మొక్క విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తులసి ఆకులను తొలగించేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. మరి తులసి ఆకులను తుంచేటప్పుడు ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి ఆకులను ఏకాదశి రోజు,రాత్రి సమయంలో ఆదివారం, చంద్రగ్రహణం , సూర్యగ్రహణం వంటి రోజులో తులసి ఆకులను తుంచకూడదు.

అలాగే తులసి మొక్కను తొలగించకూడదు. ఈ రోజుల్లో తులసి ఆకులను తుంచడం వల్ల మనకు అందాల్సిన మంచి ఫలితాలు అందవు. ఇంట్లో దురదృష్టం కలుగుతుందట. ఆదివారాలలో తులసి మొక్కకు నీరు కూడా పోయకూడదు. అలాగే ఎప్పుడూ కూడా తులసి ఆకులను గోళ్లతో గిల్ల కూడదు. తుంచకూడదు. తులసి మొక్కను ఎండ తగిలేలా పెంచాలి. చీకట్లో పెంచకూడదు. ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం అన్నది తప్పనిసరి. తులసి ఆకులను గోళ్లతో తుంచకూడదు. అలాగే తులసి ఆకులను అవసరం లేకుండా తుంచకూడదు. కేవలం మతపరమైన లేదా ఆరోగ్యపపరమైన అవసరాలకు మాత్రమే ఆకులను ఉపయోగించాలి. అదేవిధంగా స్నానం చేయకుండా తులసి ఆకులను, తులసి మొక్కను తాకకూడదు. తులసి ఆకులో ఉండే ఆమ్లాలు దంతాలకు హాని చేస్తాయి.

కాబట్టి డైరెక్ట్ గా ఆకులు తినకుండా నీటిలో మరిగించి తాగడం మంచిది. అలాగే కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా తులసి ఆకులు ఎండిపోతూ ఉంటాయి. అలా ఎండిపోయిన తులసి ఆకులను పడేయడం చేయకూడదు. ఆ ఆకులను తులసి కోటలోని మట్టిలోనే వేయాలి. అలా చేయడం వల్ల మొక్క మంచిగా పెరుగుతుంది. ఎండిపోయిన తులసి మొక్కలను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మొక్క పవిత్రమైనది కాబట్టి ఏదైనా నదిలో లేదా బావిలో వేయడం మంచిది. ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఇంటికి ఆగ్నేయ మూలలో తులసి మొక్క ఉంచకూడదు. తులసి మొక్కను భూమిలో నాట కూడదు. ఏదైనా కుండీలో పెంచుుకోవడం మంచిది. తులసి మొక్క సమీపంలో చెత్త పడేయకూడదు. శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త డబ్బాలు, చీపిరి లాంటి వి ఉంచకూడదు. ఏదైనా ముళ్లు ఉన్న మొక్క దగ్గర తులసి మొక్క ఉంచడం మంచిది కాదు.