Wednesday Donts: బుధవారం రోజు అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే కష్టాలను ఏరికోరి తెచ్చుకున్నట్టే?

హిందూ సంప్రదాయంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అందులో భాగంగానే బుధవారం గణపతికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు.

  • Written By:
  • Publish Date - December 17, 2023 / 07:00 PM IST

హిందూ సంప్రదాయంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అందులో భాగంగానే బుధవారం గణపతికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు. బుధవారం రోజున వినాయకుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇక బుధవారం రోజున గణనాథుడిని పూజించడం వల్ల జాతకంలో ఉన్న బుధ దోషాలు తొలగిపోతాయి. కానీ చాలామంది బుధవారం రోజు చేసే తప్పుల వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం తెలిసి తెలియకుండా కూడా బుధవారం రోజు కొన్ని తప్పులు చేయకూడదని చెబుతూ ఉంటారు. మరి బుధవారం రోజు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, కొన్నిసార్లు మనకు డబ్బు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనం చేసే చిన్న చిన్న త‌ప్పులు మన జీవితాన్ని నాశనం చేయ‌డంతో పాటు, ఆర్థిక‌ సమస్యలకు కార‌ణ‌మ‌వుతాయి. ముఖ్యంగా బుధవారాల్లో డబ్బు లావాదేవీలు చేయకూడదు. బుధవారం పని కోసం పవిత్రమైన రోజుగా చెప్పిన‌ప్ప‌టికీ, ఈ రోజు డబ్బు వ్యవహారాలకు శ్రేయస్కరం కాదు. మీరు బుధవారం ఎవరికైనా డబ్బు ఇస్తే, ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందని అనుకోకండి. మీరు బుధవారం ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకున్నట్లయితే, దాన్ని తిరిగి చెల్లించడానికి మీరు 100 రెట్లు ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఫలితంగా, మీ రుణం తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. ఎవ‌రికైనా డబ్బు అన్నది పెద్ద సమస్య.

అవ‌స‌రానికి మించి డబ్బు ఉన్నప్పుడు ప్రజలు నియంత్రణ కోల్పోతారు. మీ అవసరాలకు అనుగుణంగా డబ్బు ఉంటే, మీరు నియంత్రణలో ఉంటారు. ఈ రెండు పరిస్థితుల్లోనూ అంటే డబ్బున్నప్పుడు, డబ్బు లేనప్పుడు డబ్బును గౌరవించడం అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సాధారణ వ్యక్తి అయినా డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఇంట్లోని మ‌హిళ‌ల‌ను, చుట్టుపక్కల స్త్రీలను గౌరవించే వారి పట్ల లక్ష్మీదేవి క‌టాక్షం ఉంటుంది. ఎవరి ఇంట్లోని స్త్రీ గౌరవానికి దూర‌మ‌వుతుందో అక్కడ ద‌రిద్రం తాండ‌వమాడుతుంది. అలాంటి వారిని ఎప్పుడూ ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఈ కారణంగా బుధవారం మీ ఇంట్లోని స్త్రీల పట్ల లేదా మీ చుట్టుపక్కల స్త్రీల పట్ల అగౌరవంగా ప్ర‌వ‌ర్తించడం అసలు మంచిది కాదు.