Site icon HashtagU Telugu

Saturday Donts: శనివారం రోజు పొరపాటున కూడా ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి?

Mixcollage 01 Dec 2023 04 16 Pm 2165

Mixcollage 01 Dec 2023 04 16 Pm 2165

మామూలుగా చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రమే శనీశ్వరుడు అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ దానధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. శని చెడు దృష్టి ఎవరిపై పడితే వారీ జీవితం కష్టాలతో నిండి పోతుంది. దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎంత బీద వారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పనులు శని దేవుడికి అస్సలు నచ్చవు. అందుకే శని దేవుడు విషయంలో కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు.

శనివారం రోజు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఎప్పుడు కూడా శనివారం రోజు పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనుగోలు చేయడం ఇంటికి తీసుకురావడం వంటివి చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల శని దేవుడికి మీపై కోపం వస్తుంది. అలాగే శనివారం రోజు ఉప్పును కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదు. శనివారం రోజు ఉప్పును కొనుగోలు చేయడం వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలహీనపడుతుంది. అలాగే శనివారం రోజు కత్తెరను కొనడం లేదంటే ఇతరులకు బహుమతిగా ఇవ్వడం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.

అదేవిధంగా శనివారం రోజు పెద్దలను ఆ గౌరవ పరచడం ఇలాంటివి చేయడం వల్ల శని దేవుడు ఆగ్రహిస్తాడు. చాలామందికి ఉండే అతి చెడ్డ అలవాటు నడుస్తున్నప్పుడు కాళ్ళను నేలకు ఏడుస్తూ నడవడం. అలా చేయడం వల్ల శనీశ్వరుడు వారిపై ఆగ్రహిస్తాడు. అందుకే ఇంట్లో పెద్దవారు నడిచేటప్పుడు కాళ్లు కొంచెం పైకి లేపి నడిచమని చెబుతుంటారు. అలాగే వంటగదిలో పాత్రలను శుభ్ర ఉంచడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. శని దేవుడు ఇలా చేసే వారికి కష్టాలను పెంచుతాడు. కాబట్టి పైన చెప్పిన విషయాలు తెలిసికానీ తెలియక కానీ అసలు చేయకూడదు.