Site icon HashtagU Telugu

Hanuman Jayanthi Puja: హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామి ఆరాధిస్తున్నారా.. అయితే ఈ ఐదు తప్పులు అస్సలు చేయకండి!

Hanuman Jayanthi Puja

Hanuman Jayanthi Puja

ఈ ఏడాది ఏప్రిల్ 12 శనివారం పౌర్ణమి రోజు 2025 న హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో అతి పెద్ద సంక్షోభాన్ని కూడా అధిగమిస్తారని నమ్ముతారు. మరి హనుమంతుడిని ఆరాధించేటప్పుడు చేయకూడని తప్పులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హనుమాన్ జయంతి రాబోతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున శ్రీ హనుమంతుడి జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 12, 2025న ఈ పవిత్ర పండుగను జరుపుకోనున్నారు.

ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో అతి పెద్ద సంక్షోభాన్ని కూడా అధిగమిస్తారని నమ్ముతారు. ఇంట్లో ఎవరైనా మరణిస్తే లేదా సూర్య, చంద్ర గ్రహణం ఉంటే పూజ చేయకూడదట. శ్రీ హనుమంతుని ఆరాధన నిషిద్ధంగా పరిగణించబడుతుందట. హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయనను పూజించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. నలుపు లేదా తెలుపు దుస్తులు ధరించడం అశుభంగా పరిగణించబడుతుందట. అలాగే మీ ఇంట్లో పగిలిన లేదా విరిగిన హనుమంతుడి విగ్రహం ఉంటే వెంటనే తొలగించాలట.

అలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసి, ఈ పవిత్రమైన రోజున కొత్త విగ్రహాలను ప్రతిష్టించాలని చెబుతున్నారు. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉన్నవారు ఉప్పు తినడం మానుకోవాలట. అలాగే ఈ రోజున మీరు దానం చేసిన వస్తువులను తీసుకోకూడదట. ఈ నియమాన్ని పాటించడం పుణ్య ఫలితాలకు దారితీస్తుందట. ఈరోజు మాంసం, ఆల్కహాల్, అశ్లీల భాషకు దూరంగా ఉండాలట. ఈ పవిత్ర రోజున మాంసాహారం, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

Exit mobile version