Site icon HashtagU Telugu

Friday Shopping Alert : శుక్రవారం పొరపాటున కూడా వీటిని కొనొద్దు  

Friday Shopping Alert

Friday Shopping Alert

Friday Shopping Alert : శుక్రవారం అంటే లక్ష్మీవారం.. లక్ష్మిదేవి సంపదకు దేవత.. ఒక వ్యక్తి జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి అనేవి లక్ష్మిదేవి దయతోనే చేకూరుతాయి. లక్ష్మీదేవిని ఆరాధించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి శుక్రవారమే ఉత్తమమైన రోజు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరని చెబుతారు. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల లక్ష్మిదేవి కోపంగా ఉంటే..  ఇంట్లో పేదరికం ప్రారంభమవుతుంది. అందుకే శుక్ర‌వారం చేయ‌కూడ‌ని  కొన్నిపనుల గురించి, శుక్రవారం కొనుగోలు చేయకూడని(Friday Shopping Alert) కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం..

→ ఆస్తి..  పూజ సామాగ్రి.. వంటగది వస్తువులు 

శాస్త్రాల ప్రకారం పూజకు సంబంధించిన వస్తువులు, వంటగదికి సంబంధించిన వస్తువులను శుక్రవారం రోజు కొనకూడదు. అలాగే, ఆ ​​రోజు ఆస్తిని కొనడం లేదా అమ్మడం కూడా అశుభం. కాబట్టి ఈ రోజున ఈ పనులు చేయకుండా ఉండండి. లేకపోతే, దాని దుష్ప్రభావం మీ కుటుంబంపై కనిపిస్తుంది.

తెలుపు లేదా వెండి రంగు వాహనాలు.. కొత్త బట్టలు 

శుక్రవారం రోజు సంగీతం, అలంకరణ, కళ, అందానికి సంబంధించిన వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. తెలుపు లేదా వెండి రంగు వాహనాలు.. కొత్త బట్టలను కొనొచ్చు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబంపై ప్రసరిస్తాయి.

Also read : Vastu Tips: ఇలా చేస్తే చాలు.. దెబ్బకి దరిద్రం వదిలిపోయి లక్ష్మిదేవి అదృష్టంలా పట్టిపీడిస్తుంది?

డబ్బు లావాదేవీలు

శుక్రవారం రోజు ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు. ఎందుకంటే శుక్రవారం నాడు అప్పు ఇచ్చినా.. తీసుకున్నా లక్ష్మిదేవి ఆగ్రహిస్తుంది. అలాగే ధన నష్టం కూడా జరగవచ్చు.

మాంసం.. మద్యం  

శుక్రవారం నాడు మాంసం తినడం, మద్యం తాగడం వల్ల ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. అందువల్ల ఈ రోజున స్వచ్ఛమైన  శాకాహారాన్ని మాత్రమే తినండి. మాంసం, మద్యం వినియోగాన్ని నివారించండి.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.