Site icon HashtagU Telugu

Hair Oil: ఈ వారాల్లో తలకు నూనె అస్సలు పట్టించకూడదు.. పట్టిస్తే శని?

Onion Hair Oil

Onion Hair Oil

సాధారణంగా నూనెను జుట్టుకు రాసుకుంటూ ఉంటారు. జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా రాసుకుంటూ ఉంటారు. అలాగే నూనెను మసాజ్ చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నూనెతో శరీరానికి మసాజ్ చేసుకోవడం వల్ల అలసట మొత్తం పోతుంది. అందుకే చాలా మంది స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం నూనె వేసుకుని స్నానం చేస్తూ ఉంటారు. ఇకపోతే నూనె ను ఎప్పుడు పడితే అప్పుడు జుట్టుకు రాయకూడదు. నూనెను తలకు పట్టించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మరి నూనె విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఏ ఏ రోజుల్లో నూనెను తలకు పట్టించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆదివారం రోజు తలకు నూనె రాయకూడదు. సూర్య భగవానుడికి ఆదివారం అంకితం చేయబడింది కాబట్టి ఆదివారం రోజున నూనె రాసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఆరోగ్యం మనసుపై చెడు ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా మంగళవారం రోజు కూడా తలకు నూనె రాయకూడదు. మంగళవారం హనుమంతునికి అంకితం చేయబడింది కాబట్టి ఆ రోజున తలకు నూనె రాయడం వల్ల వయసు తగ్గుతుంది. గురువారం రోజున తలకు నూనె పట్టించకూడదు. ఆ విధంగా చేయడం వల్ల అప్పుల బాధలు పెరుగుతాయి.

అంతేకాకుండా రాబోయే కాలంలో ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుక్రవారం లో కూడా నూనెను తలకు రాయకూడదు. ఈ రోజు తలకు నూనె రాయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది. అంతే కాకుండా సమాజంలో గౌరవం తగ్గి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏ రోజుల్లో కూడా రాసుకోవడం మంచిది అన్న విషయానికి వస్తే.. సోమ,బుధ,శనివారాల్లో తలకు నూనె రాసుకోవడం మంచిది. ఆ రోజుల్లో తలకు నూనె రాసుకోవడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది.